సుమ…రాజీవ్ ను వదిలేసింది??

బుల్లి తెరపై ఎందరో యాంకర్స్ మెరుస్తూ ఉంటారు…అయితే…ఎంత అందంగా ఉన్నా..ఎంత వాక్ఛాతర్యం ఉన్నా…అక్కడ నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం అలాంటిది..సుమ కనకాల, అదీ కేరళ కుట్టి ఎంతో కష్టపడి తనకంటూ మంచి క్రేజ్ ను సంపాదించుకుని…బుల్లి తెరపై టాప్ యాంకర్ ఎవరు అంటే 10మందికి 9మంది సుమా పేరే చెబుతారు. అంతేకాకుండా అటు సినిమా వేదికల పైన సుమా తన మాటల గారడీతో అందరినీ ఇట్టే కట్టి పడేస్తుంది.

అలాంటి సుమ రాజీవ్ ను ప్రేమించి పెల్లడిన విషయం అందరికీ తెలిసిందే…అయితే వీళ్ళిద్దరూ దాదాపుగా విడిపోయారంట….అది కూడా వాళ్ళె చెప్పారు అంటుంది టాలీవుడ్ మీడియా….పొరపాటున ఇప్పుడు అనుకునేరు….ఇదంతా సుమా-రాజీవ్ పెళ్లి ముందు మ్యాటర్ అండీ బాబు. ఇంతకీ విషయం ఏమిటంటే…ఓ టీవి చానల్ లో ఇద్దరు కలిసి పనిచేసే సమయంలో సుమా రాజీవ్ ఇద్దరూ ఒకరికొకరు ఇష్టపడ్డారు, రాజీవ్ మొదట తన ప్రపోజల్ తెలిపాడట. ఆ ప్రపోజల్ కి చాలా టైమ్ తీసుకొని ఓకే చెప్పిందట..ఆ సమయంలో సుమ సినిమాల్లో కూడా నటిస్తుందట.

అయితే పెళ్ళికి ముందే రాజీవ్ ఒక ప్రపోసల్ పెట్టాడట….అదేమిటంటే….పెళ్లి అయ్యాక సినిమాలు మానెయ్యాలి అని….దాంతో పెళ్లికి ముందే ఇన్ని కండీషన్లయితే..తర్వాత పరిస్థితి ఏంటా అని దాదాపుగా రాజీవు ను రెండేళ్ళు వదిలేసి గుడ్ బై చెప్పిందట…ఆ తర్వాత సుమ సినిమాల్లో చేయడం మానేసిందట. తర్వాత రాజీవ్ ని కలవడం..తిరిగి వారి మద్యప్రేమ చిగురించడం పెళ్లి చేసుకోవడం అయ్యిందట.అదీ మ్యాటర్ ఏమైనా…వాళ్ళిద్దరూ గ్రేట్ అనే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus