Suma: ‘సుమక్క రేంజ్ అది’ అంటున్న నెటిజన్లు.. మేటర్ ఏంటంటే?

టాలీవుడ్ లో నెంబర్ వన్ యాంకర్ ఎవరు అంటే చాలా మంది నోటి నుండి సుమ పేరే వినిపిస్తుంది. ఏ సినిమా వేడుక నిర్వహించాలన్నా.. సుమ ఉండాలి అని సినిమా యూనిట్ అంతా కోరుకుంటూ ఉంటుంది. ఆమె ఉంటేనే ఆ వేడుకకు అందం అనడంలో అతిశయోక్తి లేదు. ఇక బుల్లితెర సుమ చేసే షోలకు టాప్ టి.ఆర్.పి రేటింగ్ నమోదవుతూ ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా ఆ షోలకు ప్రత్యేక ఆదరణ ఏర్పడుతుంది.

ప్రతీ ఫ్యామిలీలోనూ ఓ మెంబర్ గా మారిపోయింది సుమ. సోషల్ మీడియాలో కూడా సుమ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే..! ఆమె గురించి ఏ వార్త వచ్చినా భీభత్సంగా వైరల్ అవుతూ ఉంటుంది. సుమ- రాజీవ్ కనకాల విడాకులు మేటర్ ఏ రేంజ్లో వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిన సంగతే. ‘భార్యా భర్తలు అన్న తర్వాత ఏదో ఒకటి అనుకోవడం, గొడవ పడడం మాములు విషయమే’ అంటూ సుమ ఆ వార్తలను కొట్టి పారేసింది.

ఇదిలా ఉండగా.. తాజాగా సుమ తన పెళ్లిలో కట్టుకున్న చీర గురించి.. దాని ధర గురించి చెప్పి అందరికీ షాకిచ్చింది. శ్రావణమాసం సందర్భంగా వరలక్ష్మీ వ్రతం పట్టుచీరల షాపింగ్ కు వెళ్లిన సుమ తన షాపింగ్ కి సంబంధించిన వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.అందులో షింఘానియా షాపింగ్ మాల్ యొక్క విశిష్టతను తెలిపిన సుమ… పట్టు చీరల యొక్క క్వాలిటీ మరియు ధర గురించి వివరంగా వర్ణించింది. ఇదే క్రమంలో రూ.15000 లోపు పట్టుచీర కావాలని సేల్స్ మెన్ ను అడిగినప్పుడు…

‘మీ రేంజ్ ఇది కాదు ఫస్ట్ ఫ్లోర్’ అంటూ అతను అనడం ఆ తర్వాత ఓ చీర ధర గురించి అడగ్గా ‘రెండు లక్షల రూపాయలనీ విన్న సుమ ‘ఇది చీరల షాపా … బంగారం షాపా, నా పెళ్ళికి కూడా నేను ఇంత కాస్ట్లీ చీర కట్టలేదు’ అంటూ తన పెళ్లి చీర కేవలం రూ.11 వేలు మాత్రమే అని తెలిపింది. ఆ తర్వాత తన పెళ్లికి 11 వేలు అంటే కాస్ట్ లీ చీరనే కదా అనే డౌట్ రావచ్చు.. నా పెళ్లి ఈ మధ్యనే జరిగింది అంటూ ఆమె చమత్కారంగా చెప్పుకొచ్చింది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus