అక్కినేని నాగేశ్వరరావును తలపిస్తున్న సుమంత్

చిన్నప్పటినుంచి నాగేశ్వర్రావు దగ్గరే పెరగడం వల్లనో లేక జీన్స్ పరంగా వచ్చిన పోలికలో తెలియదు కానీ.. సుమంత్ ను చూస్తుంటే అచ్చు అక్కినేని నాగేశ్వర్రావుగారిని చూస్తున్నట్లే ఉంది. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఎన్.టి.ఆర్” చిత్రంలో అక్కినేని నాగేశ్వర్రావుగా సుమంత్ నటిస్తున్నాడు. ఉన్నవి కొన్ని సన్నివేశాలే అయినా దర్శకుడు క్రిష్ అక్కినేని కుటుంబ కథానాయకుడే ఆ పాత్రను పోషిస్తే బాగుంటుందని భావించడం.. ఆల్రెడీ నాగచైతన్య “మహానటి”లో నాగేశ్వర్రావుగా మెప్పించి ఉండడంతో సుమంత్ ను తీసుకొన్నాడు క్రిష్. తొలుత సుమంత్ స్వర్గీయ ఏయన్నార్ పాత్రకి సూట్ అవుతాడా అని చాలామంది అనుకొన్నారు.

కానీ.. నేడు నాగేశ్వర్రావు జయంతిని పురస్కరించుకొని విడుదల చేసిన “ఎన్.టి.ఆర్” చిత్రంలో ఏయన్నార్ ఫస్ట్ లుక్ అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది. సుమంత్ తదేకంగా చూస్తున్నట్లుగా ఉన్న ఫోటో చూస్తుంటే.. అందర్నీ ఏయన్నారే గుర్తుకొస్తున్నారు. ముఖ్యంగా ఆ కళ్ళు చూస్తుంటే ఏయన్నార్ ను సజీవంగా మరోమారు చూస్తున్న అనుభూతిని కలిగిస్తోంది. సుమంత్ డెడికేషన్, క్రిష్ క్రియేటివిటీ ఈ స్టిల్ తో తెలుస్తోంది. ఆల్రెడీ చంద్రబాబుగా రాణాని మార్చేసిన క్రిష్ ఇప్పుడు ఏయన్నార్ గా సుమంత్ కి మరోరూపమిచ్చి తన స్థాయిని, సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేశాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus