Sundeep Kishan: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో సందీప్ నెక్స్ట్ మూవీ..!

  • February 22, 2024 / 12:52 PM IST

సందీప్ కిషన్… టాలీవుడ్లో ఉన్న ప్రామిసింగ్ హీరో. లుక్స్ పరంగా, నటన పరంగా మాత్రమే కాదు విభిన్న కథాంశంతో కూడుకున్న కథలను ఎంపిక చేసుకుంటూ తన స్పెషాలిటీ చాటుకుంటూనే ఉన్నాడు. లోకేష్ కనగరాజ్, పి.మహేష్ బాబు(మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి దర్శకుడు) , మేర్లపాక గాంధీ, వంటి ఎంతో మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ను పరిచయం చేసింది సందీప్ కిషన్ అనడంలో సందేహం లేదు. అయితే కొన్నాళ్లుగా సందీప్ కిషన్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదు.

అయితే ఇటీవల వచ్చిన ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా కొంతలో కొంత బాగానే పెర్ఫార్మ్ చేసింది అని చెప్పాలి. వాస్తవానికి ఈ సినిమాకి కూడా మొదట మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది. వీక్ డేస్ లో కూడా బాగానే పెర్ఫార్మ్ చేస్తుంది. యూ.ఎస్, నైజాం వంటి ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. మిగిలిన ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. సో సందీప్ ఎదురుచూసిన కమర్షియల్ సక్సెస్ దొరికినట్టే..!

కాబట్టి.. ఇప్పుడు కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో తన నెక్స్ట్ సినిమాని త్రినాథ్ రావు నక్కిన వంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో చేయబోతున్నట్టు టాక్. ‘ఊరు పేరు భైరవకోన’ నిర్మాతలే ఈ సినిమాని కూడా నిర్మించబోతున్నారు అని సమాచారం. త్రినాథ్ రావు నక్కిన తెరకెక్కించిన సినిమాలు బాగానే ఆడతాయి. ‘ధమాకా’ తో అతని రేంజ్ పెరిగింది. కానీ తర్వాత ఏ సినిమా చేయలేదు. ఇప్పుడు (Sundeep Kishan) సందీప్ కిషన్ తో అతను ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus