Sundeep Kishan: డబుల్ మీనింగ్ ప్రశ్నలు అడిగిన మీమర్ కి ఓ రేంజ్లో క్లాస్ పీకిన సందీప్ కిషన్!

  • February 24, 2024 / 02:09 PM IST

సందీప్ కిషన్ టాలీవుడ్లో ఉన్న హీరోల్లో మోస్ట్ ప్రామిసింగ్ హీరో. వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ వంటి ఎంతో మంది టాలీవుడ్ డైరెక్టర్స్ ని టాలీవుడ్ కి పరిచయం చేశాడు. అతని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సోసోగానే ఆడుతున్నప్పటికీ.. ఓటీటీల్లో, స్మాల్ స్క్రీన్ పై వాటికి మంచి ఆదరణే లభిస్తుంటుంది. ఇటీవల ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సందీప్. ఆ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా అతనికి కమర్షియల్ సక్సెస్ ను అందించింది.

రెండో వీకెండ్ కి కూడా బజ్ ఉన్న సినిమాలు ఏమీ రిలీజ్ కాలేదు. అందువల్ల ఈ వీకెండ్ కూడా ఆ సినిమా ప్రేక్షకులకి ఆప్షన్ అయ్యింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాని రెండో వీకెండ్ కూడా నిలబెట్టేందుకు ‘ఊరు పేరు భైరవకోన’ యూనిట్ తమ వంతు ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన.. ఇన్ఫ్లుయెన్సర్ మీట్ లో ఓ మీమర్ అడిగిన ప్రశ్నలకి సందీప్ ఫుల్ గా క్లాస్ పీకాడు.

‘మీరు ఇద్దరు హీరోయిన్లతో చేశారు కదా’ అంటూ డబుల్ మీనింగ్ ప్రశ్నలు అడగడం మొదలు పెట్టాడు ఓ మీమర్. దీనికి సందీప్ కి కోపం వచ్చింది. ఒకసారి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. అయినా ఆ మీమర్ పదే పదే డబుల్ మీనింగ్ ప్రశ్నలు అడగడానికి ట్రై చేశాడు.

అంతే సందీప్ (Sundeep Kishan) ‘ మీ మదర్ టంగ్ ఏంటి?’ అని అడిగాడు. దానికి అతను ‘తెలుగు’ అని చెప్పాడు… ‘నేను వద్దు అని చెప్పినా మళ్ళీ మళ్ళీ డబుల్ మీనింగ్ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావ్, తెలుగు పూర్తిగా రాదా నీకు’ అన్నట్టు ఓ రేంజ్లో క్లాస్ పీకాడు సందీప్.

సుందరం మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!

మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా రివ్యూ & రేటింగ్!
సిద్ధార్ధ్ రాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus