అంత రిస్క్ అవసరమా….వంశీ!!!

  • September 3, 2016 / 09:43 AM IST

టాలీవుడ్ లో ట్యాలెంటెడ్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. అదే క్రమంలో ఎవరికి వారి తమ జొనర్ లో సినిమా చేసుకుంటూ వెళుతున్నారు. అయితే కధను, కుటుంభంలోని రిలేషన్స్ ను, ఇంకా చెప్పాలి అంటే ఊరి అందాలు, బంధాలు, బాంధవ్యాలను గురించి సినిమాలు తీసే చాలా తక్కువ మంది దర్శకుల్లో మన కృష్ణ వంశీ ఒకరు. ఇదిలా ఉంటే మెగా పవర్ స్టార్ చెర్రీ తో కృష్ణ వంశీ చేసిన గోవిందుడు అందరివాడేలే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డమాల్ మనడంతో ప్రస్తుతం కృష్ణ వంశీ సందీప్ కిషన్ హీరోగా ‘నక్షత్రం’ అన్న సినిమాను చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఎలా అయిన హిట్ కొట్టాలీ అన్న కసితో ఉన్న వీళ్ళు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో సందీప్ పోలీస్ పాత్రలో ఉండడంతో చాల్ రిస్కీ షాట్స్ లో డూప్ లేకుండా స్వయంగా పాల్గొంటున్నాడు. గతంలో ఒక రిస్కి షాట్ లో పాల్గొన్న మన సందీప్ కిషన్ గాయాలపాలయ్యాడు కూడా . అయినాసరే ఏ మాత్రం సందేహించకుండా.. మళ్లీ డూప్ లేకుండానే యాక్షన్ సీన్స్ లో పాల్గొంటున్నాడు. రీసెంట్ గా ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కించారు. 150 కార్లు ఎదురుగా స్పీడ్ గా వస్తుండగా.. పోలీస్ పాత్రలో నటిస్తున్న సందీప్ కిషన్ వాటికి ఎదురుగా కారు తోలే సీన్ ని సూపర్బ్ గా పిక్చరైజ్ చేశారట. ఈ సీన్ కోసం ఎటువంటి డూప్ లను ఉపయోగించకుండా స్వయంగా చేసేశాడట సందీప్ కిషన్. మరి ఇంత కష్టపడుతున్న మన వాడికి ఈ సినిమా ఆమాంచి సక్సెస్ ను ఇవ్వాలని ఆశిద్దాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus