Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » నాకు ఇలాంటి అవకాసం మళ్లీ రాదేమో – హీరో సునీల్

నాకు ఇలాంటి అవకాసం మళ్లీ రాదేమో – హీరో సునీల్

  • February 16, 2016 / 11:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాకు ఇలాంటి అవకాసం మళ్లీ రాదేమో – హీరో సునీల్

దిల్ రాజు నిర్మాతగా సునీల్‌, నిక్కీగల్రాని, డింపుల్‌ చోపడే నటీనటులుగా రూపొందిన చిత్రం ‘కృష్ణాష్టమి’. వాసువర్మ దర్శకత్వం వహించారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఆడియో సక్సెస్‌లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్లాటినం డిస్క్‌ వేడుకని నిర్వహించారు. దిల్‌ రాజు చిత్ర యూనిట్‌కి ప్లాటినం డిస్క్‌ షీల్డ్‌లను అందజేశారు.

”స్టార్‌ హీరో నటించే సత్తా ఉన్న కథ ఇది. సునీల్‌ సినిమాకు కావలసిన అంశాలను జోడించి తెరకెక్కించాం. దీని వెనుక వాసువర్మ కష్టం ఎంతో ఉంది. సునీల్‌ ఈ కథకు కరెక్ట్‌గా ఫిట్‌ అయ్యాడు. ఫస్ట్‌ కాపీ చూశాక వాసువర్మ ఎలా ఉందని అడిగాడు. సింపుల్‌గా థమ్సప్‌ సింబల్‌ చూపించాను. ఈ సినిమా సక్సెస్‌ విషయంలో నా అంచనాల్ని దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు” అని దిల్‌ రాజు అన్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ”ఏడాదిన్నర క్రితం సునీల్‌కి లైన్‌ చెప్పాను. వెంటనే చేద్దాం అన్నాడు. తర్వాత వాసువర్మకి ఈ కథ చెప్తే కాదనలేక విన్నాడు. ఇందులో ఏదో మిస్‌ అయిందని ఆరు నెలలు స్క్రిప్ట్‌ వర్క్‌ చేసి పూర్తి కథను తయారు చేశాడు. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే వాసు వర్మ కూడా ఓ కారణం. కెరీర్‌ ప్రారంభంలో నా సూపర్‌హిట్టైన ‘దిల్‌’, ‘ఆర్య’, ‘బొమ్మరిల్లు’ సినిమాలకు నా పక్కనే ఉన్నాడు. అతనిలో గొప్ప రచయిత ఉన్నాడు. ఈ సినిమాతో దర్శకుడిగా నిరూపించుకుంటాడు. 2.50 నిమిషాల అవుట్‌పుట్‌ని 2.15 నిమిషాలకు కుదించాం. బెటర్‌ అవుట్‌పుట్‌ కోసం సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరి సలహా తీసుకున్నాం. డబ్బింగ్‌ సమయంలో ప్రీ క్లైమాక్స్‌లో ఏదో వెలితిగా ఉందని డబ్బింగ్‌ ఇంజనీర్‌ పప్పు చెప్పిన సలహా కూడా పాటించాం. ఈ నెల 19న విడుదల కాబోతున్న మా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని ఆ సంస్థకు మంచి పేరు తీసుకొస్తుంది” అని అన్నారు.

సునీల్‌ మాట్లాడుతూ ”నా కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ చిత్రమిది. ఇలాంటి అవకాశం మళ్లీ రాదేమో. ఇందులో చాలా అనందంగా కనిపిస్తాను. కుటుంబం మొత్తం చూడదగ్గ చిత్రమిది. మనిషి పుట్టాడంటే ఇంటెలిజెంట్‌గా పుట్టాలి. లేదంటే వాసువర్మలాంటి ఇంటెలిజెంట్‌ ఫ్రెండ్‌ అయినా ఉండాలి. నా కెరీర్‌ మంచి సినిమా ఇచ్చాడు. మర్యాద రామన్న సినిమా చేసినప్పుడు ఎంత ఆనందంగా ఫీలయ్యానో..ఈ సినిమాకు అలాగే ఫీలయ్యాను” అని అన్నారు.

వాసువర్మ మాట్లాడుతూ ”సినిమా హిట్‌ అవుతుందా లేదా అన్నది దిల్‌ రాజుగారి ఎక్స్‌ప్రెషన్‌తో చెప్పేయోచ్చు. ‘జోష్‌’ సినిమా చూశాక ‘సార్‌ ఏంటి పరిస్థితి అని అడగగానే ఏవరేజ్‌ సినిమా’ అని చెప్పారు. రిలీజ్‌ అయ్యాక అదే నిజమైంది. ఈ సినిమా చూసి ఆయనెంతో ఆనందంగా ఉన్నారు. ఎలా ఉందని అడిగితే నవ్వుతూ సక్సెస్‌ సింబల్‌ చూపించారు. మా అందరి నమ్మకం కూడా అదే. హిట్‌ సినిమాకు కావలసిన అన్నీ సమపాళ్లలో కుదిరిన సినిమా ఇది. సునీల్‌ కావలసిన దానికన్నా ఎక్కువ కష్టపడి పనిచేశాడు. సినిమా బెటర్‌మెంట్‌ కోసం ఆర్టిస్ట్‌లు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. కానీ కొందరు నిర్మాతలు అందుకు సహకరించరు. దిల్‌రాజు ది బెస్ట్‌ అవుట్‌పుట్‌ కోసం ఎంత ఖర్చైనా చేస్తారు” అని అన్నారు.
దిల్‌రాజుగారి అభిరుచికి తగ్గ పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు దినేష్‌ చెప్పారు.

సునీల్, నిక్కి గల్రాని, డింపుల్ చోపడే, బ్రహ్మానందం, అశుతోష్ రానా, ముకేష్ రుషి, పోసాని కృష్ణ మురళి, రాజన్ మోడీ,  సుమన్, సప్తగిరి, పవిత్ర లోకేష్, తులసి, తదితర ముఖ్య నటులు ఈ చిత్రం లో ఉన్నారు.
దర్శకత్వం – స్క్రీన్ప్లే – వాసు వర్మ . నిర్మాత – రాజు . సహ నిర్మాతలు – శిరీష్ , లక్ష్మణ్ . ఫోటోగ్రఫీ – చోటా కె. నాయుడు . ఎడిటర్ – గౌతం రాజు . సంగీతం – దినేష్ . కథ – శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ టీం .  ఫైట్ మాస్టర్ – అనల్ అరసు. ఆర్ట్ డైరెక్టర్ – ఎస్. రవీందర్. నిర్మాణం  – శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Sunil
  • #Sunil Movies

Also Read

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

related news

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

trending news

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

1 hour ago
Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

2 hours ago
NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

3 hours ago
Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

4 hours ago
Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

23 hours ago

latest news

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

35 mins ago
Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

1 hour ago
Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

4 hours ago
Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

4 hours ago
Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version