ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రంలో కమెడియన్ గా రీ ఎంట్రీ ఇవ్వనున్న సునీల్!
- September 14, 2017 / 10:34 AM ISTByFilmy Focus
సినిమాల్లోకి ప్రేవశించక ముందు నుంచి త్రివిక్రమ్, సునీల్ బెస్ట్ ఫ్రెండ్స్. అప్పటికీ ఇప్పటికీ ఇద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగుతోంది. త్రివిక్రమ్ రచయితగా ఉన్నప్పుడు స్నేహితుని కోసం మంచి రోల్స్ రాసేవారు. డైరక్టర్ గా మారిన తర్వాత కూడా అతడు, జల్సా, ఖలేజా చిత్రాల్లో బెస్ట్ రోల్స్ ఇచ్చి ప్రోత్సహించారు. అయితే సునీల్ హీరోగా ఎదిగిన తర్వాత త్రివిక్రమ్ సినిమాలో చిన్న పాత్రలు చేయలేదు. మిత్రుడు హీరోగా ఎదగాలని పిలవలేదు. అయితే ఇప్పుడు సునీల్ పరిస్థితి ఏమీ బాగాలేదు. అతను హీరోగా నటించిన చిత్రాలు వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
అందుకే హాస్యనటుడిగా రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. హీరోగా నటిస్తూనే కమెడియన్ గా నటించడానికి రెడీ అవుతున్నారు. త్రివిక్రమ్ సినిమా ద్వారా కమెడియన్ గా రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఆ విషయాన్నీత్రివిక్రమ్ కి చెబితే అతను ఓకే చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ 25 వ సినిమాని తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత ఎన్టీఆర్ తో ఓ ఫ్యామిలీ మూవీ చేయనున్నారు. ఇందులో సునీల్ కోసం మంచి రోల్ క్రియేట్ చేసినట్లు సమాచారం. మరి రోల్ ఎలా ఉండబోతుందే తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















