Sunil: అదే లుక్‌, అదే ఫీల్‌తో స్టార్‌ విలన్‌ సునీల్‌ కొత్త సినిమా? ఈసారి ఎక్కడంటే?

  • November 5, 2023 / 03:50 PM IST

ఒక నటుడు ఒక పాత్రలో బాగా నటించాడు అనిపిస్తే, ఆ సినిమా హిట్‌ అయితే… ఇక ఆ నటుడికి అలాంటి పాత్రలే ఎక్కువగా వస్తాయి. అంతేకాదు ఆ పాత్ర తరహాలోనే, ఆ లుక్‌లోనే క్యారెక్టర్‌ను డిజైన్‌ చేస్తూ ఉంటారు. తాజాగా టాలీవుడ్‌లో ఇంకా చెప్పాలంటే సౌత్‌ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నటుడు సునీత్‌. ‘పుష్ప’ సినిమాలో విలన్‌గా డిపరెంట్‌లో, గెటప్‌లో కనిపించిన సునీల్‌ ఆ తర్వాత అలాంటి పాత్రలో వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ అయిపోయాడు.

కావాలంటే మీరే చూడండి ‘పుష్ప’ సినిమాతో పాన్‌ ఇండియా యాక్టర్‌ అయిపోయిన సునీల్‌ ఆ తర్వాత పక్క చలన చిత్ర పరిశ్రమలో చేస్తున్న సినిమాల పాత్రల లుక్‌లు దాదాపు ఒకేలా ఉంటున్నాయి. ‘పుష్ప’ సినిమాలో చేసిన మంగళం శ్రీను లుక్‌లోనే తర్వాత శివకార్తికేయన్‌ ‘మావీరన్‌’, రజనీకాంత్‌ ‘జైలర్‌’, విశాల్‌ ‘మార్క్‌ ఆంటోనీ’ సినిమాల్లో నటించాడు. ఇప్పుడు కార్తి ‘జపాన్‌’ సినిమాలోనూ యాక్ట్‌ చేస్తున్నాడు. వీటన్నింటిలో సునీల్‌ దాదాపు ఒకే లుక్‌లో కనిపిస్తాడు.

ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఇలాంటి లుక్‌లోనే సునీత్‌ కన్నడ చలనచిత్ర పరిశ్రమకు వెళ్లబోతున్నాడు. అక్కడ సుదీప్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. దాన పేరు ‘మ్యాక్స్‌’. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం సునీల్‌ను తీసుకున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు కూడా. దీంతో ఈ సినిమాలో పాత్ర ఎలా ఉండబోతోంది అనే చర్చ కూడా మొదలైంది.

ఈ సినిమాలు కాకుండా సునీల్‌ తెలుగులో ‘గుంటూరు కారం2, ‘గేమ్‌ఛేంజర్‌2, ‘పుష్ప: 2’ లాంటి పెద్ద సినిమాలు ఉన్నాయి. ఈ సమయంలో ఈ డూప్లికేట్‌ బియ్యం లెక్కేంటి? సుదీప్‌ ‘మ్యాక్స్‌’ విషయంలో షూటింగ్‌ ఇటీవల మొదలైంది. అందులో సునీల్‌ చేరినట్లు టీమ్‌ ఓ పోస్టర్‌ రిలజ్‌ చేసింది. దీనిని చూసి అదే లుక్‌, అదే ఫీల్‌తో స్టార్‌ విలన్‌ (Sunil) సునీల్‌ కొత్త సినిమానా? అని అడుగుతున్నారు. దీనికి సమాధానం ఎవరి చెబుతారో చూడాలి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags