ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో మన ప్రొడ్యూసర్ టర్నడ్ పొలిటీషియన్ బండ్ల గణేష్ తర్వాత ఆస్థాయిలో కామెడీ చేసి.. బెస్ట్ ఎంటర్ టైనర్ గా నిలిచిన వ్యక్తి కె.ఏ.పాల్. నిజానికి పాల్ చాలా గొప్పోడే అయినప్పటికీ.. ఈ ఎన్నికల్లో మనోడి బిహేవియర్ మాత్రం కామెడీ అయిపోయింది. దాంతో పాల్ చేష్టల్ని జనాలు భలే ఎంజాయ్ చేశారు. పాల్ ఇంటర్వ్యూలు, ఎక్స్ ప్రెషన్స్ అన్నీ మీమ్ స్టఫ్ గా భలే ఉపయోగపడింది.
అయితే.. ఇప్పుడు పాల్ క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకొని ఒక సినిమా తెరకెక్కనుంది. పోలిటికల్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ చిత్రంలో సునీల్ టైటిల్ పాత్ర పోషించనున్నాడట. ఓ యువ ప్రతిభాశాలి దర్శకుడిగా పరిచయమవ్వనున్న ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుంది. త్వరలోనే ఈ ప్రొజెక్ట్ కి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రానుంది. ఇకపోతే.. సునీల్ ఇలా కామెడీ ట్రాక్ లోకి పూర్తిస్థాయిలో వచ్చేయడం మాత్రం సునీల్ అభిమానుల ఆనందానికి ముఖ్యకారణంగా మారింది.