ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు రకరకాల ఆదాయ మార్గాలు ఉంటాయి. సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత మరింత సంపాదించేస్తున్నారు. వారికి ఉన్న ఫాలోయింగ్ ను చాలా కంపెనీలు తమ ప్రమోషన్స్ కోసం వాడుకుంటున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ లో ఓ ట్వీట్ వేయాలన్నా.. ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టాలన్నా.. లక్షల్లో ఛార్జ్ చేస్తుంటారు. కొందరు తారలకు కోట్లు కూడా ఇస్తున్నారు. అంతేకాదు.. ఓ టీజర్ ని, లేదా ఫస్ట్ లుక్ ని లాంచ్ చేయాలన్నా కూడా డబ్బులు చెల్లించాల్సిందే.
ఇదంతా ఓపెన్ సీక్రెట్. రీసెట్న్ గా ‘బాయ్స్’ అనే చిన్న సినిమా టీజర్ ను బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్ ముంబైలో ఆవిష్కరించింది. ఇదెలా సాధ్యమైందని చాలా మంది అనుకున్నారు. సినిమాకి సంబంధించి ఎవరో ఒకరు పరిచయమై ఉంటారని.. ఆ కారణంగానే టీజర్ లాంచ్ చేసి ఉంటుందని కొందరు అనుకున్నారు. కానీ దీనివెనుక కమర్షియల్ యాంగిల్ ఉన్నట్లు తెలుస్తోంది. టీజర్ లాంచ్ చేయడానికి సన్నీలియోన్ ఏకంగా రూ.12 లక్షలు రెమ్యునరేషన్ గా తీసుకుందని సమాచారం.
చిన్న సినిమా జనాల్లోకి వెళ్లడం కోసం నిర్మాత తెగించి ఈ రేంజ్ లో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దానికి తగ్గట్లే ఈ టీజర్ కి మిలియన్ వ్యూస్ వచ్చాయి. మొత్తానికి సన్నీలియోన్ ఈ రకంగా కూడా సంపాదించేస్తూ బిజీ అయిపోయింది!