Mahesh Babu: ఆ బ్యాంక్ కు భారీ షాకిచ్చిన సుప్రీం కోర్టు!

రెండు రోజుల క్రితం విడుదలైన సర్కారు వారి పాట సినిమా టాక్ తో సంబంధం లేకుండా థియేటర్లలో కలెక్షన్లను సొంతం చేసుకుంటునన్న సంగతి తెలిసిందే. ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్నా టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. పరశురామ్ సర్కారు వారి పాట మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ కాదని చెప్పినా సినిమాలో అంతర్లీనంగా ఉన్న మెసేజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మహేష్ ఖాతాలో మరో సక్సెస్ చేరినట్టేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

వీక్ డేస్ లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోనుందో చూడాల్సి ఉంది. సమ్మర్ హాలిడేస్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయని కొంతమంది అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పరశురామ్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సినిమా ఫలితం మరింత మెరుగ్గా ఉండేదని మహేష్ బాబు అభిమానుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే సర్కారు వారి పాట మూవీలో మహేష్ చెప్పిన తీర్పులా తాజాగా ఒక కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఉంది.

దర్శకుడు పరశురామ్ సర్కారు వారి పాట సినిమాలో లోన్ రికవరీ విషయంలో సామాన్యులకు, ధనవంతులకు మధ్య ఎలాంటి తేడా చూపించకూడదని చూపించిన సంగతి తెలిసిందే. ఒక బ్యాంకు రైతుల నుంచి రుణాలను రికవరీ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ ను దాఖలు చేసింది. ఆ పిటిషన్ గురించి సుప్రీం కోర్టు స్పందిస్తూ పెద్ద చేపలను పట్టుకున్న తర్వాత రైతుల జోలికి వెళ్లాలని కామెంట్ చేసింది.

ఇలాంటి పిటిషన్ల వల్ల రైతుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ ట్వీట్ గురించి జోరుగా చర్చ జరుగుతుండటం గమనార్హం. రైతులకు అనుకూలంగా తీర్పు రావడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. మైత్రీ మూవీ మేకర్స్ కోర్టు తీర్పును సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ తీర్పు నెట్టింట వైరల్ అవుతోంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus