Supriya: ఇంటర్వ్యూ : ‘బాయ్స్ హాస్టల్’ సినిమా ప్రమోషన్స్ లో నిర్మాత సుప్రియ యార్లగడ్డ ఆసక్తికర కామెంట్లు..!

  • August 23, 2023 / 08:17 PM IST

టాలీవుడ్ లీడింగ్ బ్యానర్స్ లో ఒకటైన ‘అన్నపూర్ణ స్టూడియోస్’ సంస్థ ‘చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్’ తో కలిసి కన్నడలో సూపర్ హిట్ అయిన ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’ చిత్రాన్ని తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. నితిన్ కృష్ణమూర్తి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఆగస్టు 26న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఇక ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత సుప్రియ యార్లగడ్డ పాల్గొని కొన్ని ఆసక్తికర కామెంట్లు చేసింది. ఆ విశేషాలు మీ కోసం :

సుప్రియ : కరెక్టే..! కానీ ఇది మంచి సినిమా అనిపించింది. కంప్లీట్ గా ఎంజాయ్ చేసే సినిమా అని ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నాను. ఓ మంచి సినిమాని తీసుకొస్తే మన తెలుగు ప్రేక్షకుల కంటే ఆదరించే ప్రేక్షకులు ఎక్కడున్నారు. ఈ సినిమా వల్ల ‘అన్నపూర్ణ స్టూడియోస్’ కి ఇంకా ఎక్కువ వాల్యూ యాడ్ అవుతుంది అనే నమ్మకం కూడా ఉంది కాబట్టి చేశాం.

ప్ర) డబ్బింగ్ సినిమాని మార్కెటింగ్ చేయడంలో ఛాలెంజ్ ఏమైనా ఉంటుందా?

సుప్రియ : ఒరిజినల్ లో ఉన్న పల్స్ అర్థం చేసుకోవాలి. ఒకప్పటి డబ్బింగ్ సినిమాకి ఇప్పటి డబ్బింగ్ సినిమాకి చాలా తేడా ఉంది. తెలుగు ప్రేక్షకులు క్వాలిటీ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారు.ఇలాంటి సినిమా డబ్బింగ్ చేయడం ఈజీ కాదు. ఎందుకంటే ఇందులో రకరకాల వాయిస్ లు ఉంటాయి. వాటికి సింక్ కరెక్ట్ గా ఉండేలా చేయాలి. ఫైనల్ గా ఈ సినిమా చూస్తే డబ్బింగ్ సినిమా అనే ఫీలింగ్ కలగదు.

ప్ర) హాస్టల్ బాయ్స్ గురించి మీకు తెలిసింది ఏంటి?

సుప్రియ : నేను హాస్టల్ లో ఎప్పుడూ ఉండలేదు. కానీ హాస్టల్ లో ఉండే ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఉన్నారు. వాళ్ళు చేసే అల్లరి చెప్పేవారు.బాయ్స్ హాస్టల్ గురించి తెలీదు. అందుకే ఈ సినిమా పై ఆసక్తి పెరిగింది.

ప్ర) రష్మిని తీసుకోవాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది?

సుప్రియ : ఇందులో ఓ రోల్ కి రష్మి పర్ఫెక్ట్ ఛాయిస్. ఇందులో చాలా హాట్ గా ఉంది. తన పాత్రతో సినిమాకు తెలుగు నేటివిటీ వచ్చింది అని చెప్పాలి. సో డబ్బింగ్ అనే ఆలోచన రాదు.

ప్ర) ఈ సినిమా కన్నడలో జులై 26న విడుదలైంది.., నెల గ్యాప్ లో తెలుగులో తీసుకురావడం అంటే ఓటీటీ రిలీజ్ సమస్య రాదా ?

సుప్రియ : నిజమే… నెల అంటే చాలా ఎక్కువ. అదొక జీవత కాలం అన్నట్టు జనాలు ఫీలవుతున్నారు.రెండు రోజుల్లో జనాలు అన్నీ మర్చిపోతున్నారు. అయితే రీ రిలీజ్ చేసినా జనాలు చూస్తున్నారు కాబట్టి.. ఓటీటీ భయం లేదు.

ప్ర) అన్నపూర్ణ బ్యానర్లో ఈ మధ్య ఎక్కువ సినిమాలు రావడం లేదు ఎందుకని?

సుప్రియ : ఇప్పుడు సినిమాలు తీసే విధానం మారింది. అయినా మేము 50 ఏళ్లుగా నిలకడగానే ఉన్నాం. ఏడాదికి ఒక సినిమా చేస్తూనే ఉన్నాం.

ప్ర) నాగార్జున గారి 100 సినిమా గురించి చెప్పండి ?

సుప్రియ : ఇది నాగార్జున గారిని అడగాలి. నేను (Supriya) ఏమైనా చెబితే నాకు అక్షింతలు పడతాయి(నవ్వుతూ)

ప్ర) చైతు, అఖిల్ తో సినిమాలు చేసే అవకాశం ఉందా?

సుప్రియ : కథల గురించి అన్వేషణ జరుగుతుంది. కొన్ని సెలెక్ట్ చేసి అలా పెట్టాం.

ప్ర) మీరు ‘గూఢచారి’ తో రీ ఎంట్రీ ఇచ్చారు?

సుప్రియ : సెకండ్ ఇన్నింగ్స్ అని కాదు. యాక్టింగ్ వచ్చా రాదా లేక మర్చిపోయినా..! అని చెక్ చేసుకోవడానికి ‘గూఢచారి’ చేశాను (నవ్వుతూ).

ప్ర) ‘గూఢచారి 2’ లో నటిస్తున్నారా?

సుప్రియ : ‘గూఢచారి 2’ లో నా పాత్ర ఉంటే తప్పకుండా చేస్తాను.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus