నెటిజన్ల కామెంట్స్ పై మండిపడ్డ సురేఖా వాణి కూతురు!

ప్రస్తుతం సోషల్ మీడియా హవా బాగా పెరిగింది. సెలెబ్రిటీల తో నెటిజన్లు డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతున్నారు. అప్పుడప్పుడు చాట్ సెషన్ లు కూడా పెడుతున్నారు. ఈ క్రమంలో ఒక్కోసారి నెటిజన్లు హద్దులు మీరు సెలబ్రిటీలను విసిగిస్తున్నారు. వారి పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఎదో ఒక ప్రశ్న అడిగి వారిని హర్ట్ చేస్తుంటారు. మరికొందరు సెలెబ్రెటీలకు సంబంధించి ఎదో ఒక విషయాన్ని తీసుకుని వారిని ట్రోల్ చేస్తుంటారు. దీంతో ఆ సెలెబ్రిటీలు కూడా సహనం కోల్పోయి నెటిజెన్ల పై మండిపడుతుండడం మనం చూస్తూనే వున్నాం. తాజాగా నటి సురేఖా వాణి కూతురు సుప్రీత కూడా నెటిజన్ల పై మండిపడింది.

సుప్రీత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. టిక్ టాక్ వీడియోలు, అలానే తనకు సంబంధించిన మరికొన్ని వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బాగా పాపులర్ అయ్యింది. ఇదిలా ఉండగా ఇటీవల తన తండ్రి(సురేఖ వాణి భర్త) చనిపోయినప్పుడు తలకొరివి పెట్టిన వీడియోలను కూడా షేర్ చేసింది. ఇక ఈ వీడియోలు చూసిన కొందరు నెటిజన్లు కామెంట్లతో ఆమె పై దాడి చేసారు. ఈ విషయంతో సుప్రీతతో పాటూ సురేఖావాణి కూడా బాధపడిందని సమాచారం.

ఈ క్రమంలో తమను తిట్టినవాళ్ళకు ధీటుగా సమాధానమిచ్చింది సుప్రీత. సుప్రీత మాట్లాడుతూ… ‘నా పై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నవారు అన్నీ తెలుసుకొని అప్పుడు విమర్శించాలి.. ఎదుటివారి పై ఒక వేలు చూపిస్తే మిగిలిన నాలుగు వేళ్ళు మనల్నే చూపిస్తాయనే విషయం గుర్తుంచుకోవాలి. ముందు మీ లైఫ్ చూసుకోండి.. ఆ తరువాత ఇతరుల విషయాల్లో వేలు పెట్టండి. నా తల్లి ఇప్పుడిప్పుడే తన భర్త మరణం నుండి కోలుకుంటుంది’ అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus