Surender Reddy , Vaisshnav Tej: అప్పుడు క్రిష్‌.. ఇప్పుడు ఈయన… వైష్ణవ్‌కే ఎందుకిలా జరుగుతోందో?

వైష్ణవ్‌ తేజ్‌.. తొలి సినిమాలోనే ఈ కుర్రాడిలో ఏదో మ్యాజిక్‌ ఉంది అనిపించుకున్నాడు. మేనమామలా కళ్లతోనే మాయ చేస్తాడు అని కూడా అన్నారు. అయితే రెండో సినిమా నుండి ఆ మ్యాజిక్‌ కనిపించడం లేదు. సినిమాలు అయితే వస్తున్నాయి కానీ.. ఏదీ సరైన విజయం అందుకోవడం లేదు. ‘కొండపొలం’, ‘రంగ రంగ వైభవంగా’ అంటూ రెండు సినిమాలొచ్చినా విజయం దక్కలేదు. దీంతో ఇప్పుడు యాక్షన్‌ – డివోషన్‌ జోనర్‌లోకి వచ్చాడు. దీని తర్వాత కామెడీ – యాక్షన్‌ మోడ్‌లోకి వస్తాడంటున్నారు.

అవును, వైష్ణవ్‌ తేజ్‌ కొత్త సినిమా దాదాపు ఓకే అయ్యిందట. ప్రస్తుతం చేస్తున్న ‘ఆదికేశవ’ తర్వాత సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్‌ తేజ్‌ సినిమా ఉంటుందట. ఈ మేరకు చర్చలు పూర్తయ్యాయట. నిర్మాత కూడా సిద్ధంగా ఉన్నారట. ‘ఆదికేశవ’ పనులు కొలిక్కి వచ్చేసిన నేపథ్యంలో ఈ సినిమాను అనౌన్స్‌ చేస్తారు అని చెబుతున్నారు. సినిమా టీమ్‌ను చూస్తుంటే మొత్తంగా మెగా ఫ్యామిలీ అంతా అనుకుని కుదిర్చినట్లు కనిపిస్తోంది. కావాలంటే పేర్లు చదవండి మీకే అర్థమైపోతుంది.

పవన్‌ కల్యాణ్‌తో సినిమా చేయాల్సిన (Surender Reddy) సురేందర్‌ రెడ్డి ఈ సినిమాకు చేస్తున్నారు. ఇక చిరంజీవి ఫ్యామిలీకి బాగా దగ్గరైన ‘ఠాగూర్‌’ మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంతకుమించి ఏం కావాలి క్లారిటీ చెప్పండి. ప్రస్తుతం కథా చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయని.. స్క్రిప్ట్‌ నచ్చడంతో వైష్ణవ్‌ సానుకూలంగా స్పందించారని తెలిసింది. దీనిపై త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అనౌన్స్‌మెంట్‌ ఇచ్చేస్తారట.

వేసవికి ‘ఏజెంట్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సురేందర్‌ రెడ్డి ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు హీరోలకు కథలు వినిపించినట్లు ప్రచారం జరిగింది. ‘రేసు గుర్రం’ కాంబో రిపీట్‌ అవుతుంది అని కూడా అన్నారు. కానీ ఇప్పుడు వైష్ణవ్‌ తేజ్‌ సినిమా ఓకే అయింది అంటున్నారు. అయితే మరి పవన్‌ కల్యాణ్‌ సినిమా ఏమైంది అనే డౌట్‌ రావొచ్చు. ఇప్పటికిప్పుడు అయితే పవన్‌ సినిమా పట్టాలెక్కే పరిస్థితి లేదు అని చెబుతున్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus