నిర్మాత సురేశ్ బాబు ప్లానింగ్ మామూలుగా ఉండదు అంటుంటారు ఇండస్ట్రీలో. రాబోయే రోజులు, పరిస్థితులు, అప్డేట్స్ను ముందుగానే అంచనా వేసి తనను తాను అప్డేట్ చేసుకుంటారు అంటారు. జూనియర్లకు, మిత్రులకు సలహాలు కూడా ఇస్తుంటారట. అంతగా అప్డేటెడ్గా ఉండి, సలహాలిచ్చే సురేశ్‌బాబు… తన కొడుకు రానాకు ఎలాంటి సలహాలు ఇస్తారు అనేది ఇంట్రెస్టింగే కదా. ఇదే మాట ఆయన్ను అడిగితే ఏమన్నారంటే…అందరి స్టార్ కిడ్స్లాగే రానా కెరీర్ కూడా ఫుల్ జోష్‌తో స్టార్ట్ అయ్యింది.
తొలి సినిమా ఊహించని విజయం అందుకుంది. అయితే ఆ తర్వాత రానా కొన్ని ఉపయోగం లేని కథలు ఎంచుకొని దెబ్బతిన్నాడు. అయితే తిరిగి పుంజుకొని బాలీవుడ్, టాలీవుడ్లో తనదైన ముద్ర వేశారు. ఆ సమయంలో సురేశ్‌బాబు సూచనలు ఏమన్నా పనికొచ్చాయా అనేది డౌటు ఉంటుంది. అయితే సినిమాల విషయం రానా అస్సలు సురేశ్‌బాబు మాట వినడు అనేది అసలు మేటర్. అలాంటి సినిమాలు చేయ్, ఆ సినిమా చేయ్ అని ఎవరు చెప్పినా రానా వినడట.
అతనికి నచ్చిన సినిమా, కథ అయితేనే ఒప్పుకుంటాడట. సినిమాల విషయంలో రానాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. వాటినే నమ్ముకుంటాడట. వాటి బట్టే నిర్ణయం తీసుకుంటాడట. ఎప్పుడైనా ఇంట్లో చర్చ వస్తే… ఫలానా సినిమా, ఫలానా పాత్ర చేస్తున్నానని చెబుతాడంట. అయితే, ఓవరాల్‌గా సూచనలివ్వడం తప్ప, ప్రత్యేకంగా ఇలా చెయ్ అని రానా ఫ్యామిలీ ఎప్పుడూ చెప్పదట.