Suriya: ముట్టల్ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్ బ్యాటింగబ్బా..
- September 28, 2026 / 02:49 PM ISTByFilmy Focus Desk
ఈ మధ్య హీరోలు ఎక్కువగా ఫ్యాన్స్ మీట్లు పెడుతున్నారు. తమ అభిమానులను ప్రత్యక్షంగా కలవడం ఒక ఆలోచన అయితే.. రెండో ఆలోచన తమ ఉద్దేశాన్ని ఫ్యాన్స్‌కి క్లియర్‌గా చెప్పడం. ఈ క్రమంలో లేనిపోని వివాదాల్లోకి వెళ్లకండి, రచ్చ చేయకండి అని చెబుతున్నారు. మొన్నామధ్య అల్లు అర్జున తన జాతీయ ఫ్యాన్స్ అందరికీ ఇలా ఓ మీట్ పెట్టి కాస్త జ్ఞాన బోధ చేశాడు. ఈ మధ్య నాని కూడా ఇదే పని చేశాడని టాక్. ఇప్పుడు కోలీవుడ్‌లో సూర్య ఆ పని చేశాడు.
Suriya
ఆల్ ఇండియాన సూర్య ఫ్యాన్స్ క్లబ్ మీట్ ఇటీవల చెన్నైలో జరిగింది. అందులో ఆయన ముట్టాల్ (ఫూల్స్ / ఫూల్స్) గురించి చెప్పిన మాటలు వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో ముట్టల్ మూర్ఖులు పోస్ట్ పెట్టినప్పుడు రిప్లై ఇవ్వకూడదని, ఎనర్జీ వేస్ట్ చేయకూడదని సూర్య తన ఫ్యాన్స్‌కి స్పష్టంగా చెప్పాడు. “వాళ్లు వాళ్లలా ఉండనివ్వండి, మనం మనలా ఉందాం” అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు. కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి, మీకు ఇష్టమైన పని చేయండి అంటూ మంచి గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

అగరం ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే విద్య, సేవా కార్యక్రమాలు చేయడం వల్ల సూర్యకు.. కేవలం సినిమా స్టార్ అనే ఇమేజ్ మాత్రమే కాకుండా.. సమాజం కోసం పనిచేసేవాడుఅనే ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు ఫ్యాన్స్‌కి చెప్పిన మాటలు ఆ ఇమేజీని ఇంకా బలం చేస్తాయి అని చెప్పొచ్చు. సూర్య తన అభిమానులను ఫైటర్స్‌గా కాకుండా సపోర్టర్స్ + గుడ్ సిటిజన్స్‌గా ఊడాలని అనుకుంటున్నాడు అని ఈ వీడియోలోని మాటల ద్వారా అర్థమవుతోంది.
వరుస విజయాలతో దూసుకుపోతున్న సూర్య.. త్వరలో ‘సీన్’ సినిమా ద్వారా సరికొత్తగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కూడా విజయం సాధిస్తే.. కెరీర్ మొత్తంలో సూర్యకు ఇదే హయ్యెస్ట్ హై మూమెంట్ అని చెప్పొచ్చు. ఆ సినిమా దీపావళి కానుకగా నవంబరు 6న రాబోతోంది.

















