ఖైదీ నంబర్ 150 మూవీ పాటల కోసం ఫుల్ ప్రిపరేషన్ లో స్టైలిష్ సుష్మిత

  • November 4, 2016 / 02:10 PM IST

మెగాస్టార్ చిరంజీవి తన 150 మూవీ కోసం తెర ముందు కష్టపడుతుంటే, అతని పెద్ద కూతురు సుష్మిత తెర వెనుక శ్రమిస్తోంది. ఖైదీ నంబర్ 150 సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్న ఈ యువ స్టైలిష్… హీరో, హీరోయిన్లు అందంగా కనిపించడానికి తన ఫ్యాషన్ పరిజ్ఞానాన్ని మొత్తం ఉపయోగిస్తోంది. దీపావళి కానుకగా విడుదలైన ఖైదీ ఫస్ట్ లుక్ కి అన్నివర్గాల ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సుష్మిత మరింత ఉత్సాహంగా పనిచేస్తోంది.

ప్రస్తుతం కణల్ కన్నన్ నేతృత్వంలో చిరంజీవిపై యాక్షన్ ఎపిసోడ్ ని దర్శ కుడు వి.వి.వినాయక్ తెరకెక్కిస్తున్నారు. ఈ ఫైట్ తో దాదాపు టాకీ పార్ట్ పూర్తి అయినట్లే. ఇక పాటలను చిత్రీకరించనున్నారు. ఇప్పటికే ఐటెం సాంగ్ కంప్లీట్ చేశారు. రైతులతో సాగే మాంటేజ్ సాంగ్ కూడా పూర్తి చేశారు. మిగిలింది నాలుగు పాటలు. వాటిలో రెండింటిని విదేశాల్లో తీయనున్నారు. ఫైట్ ముగియగానే చిత్ర బృందం ఫారెన్ కి పయనం కానుంది. ఆయా పాటల్లో చిరు, కాజల్ అగర్వాల్ వేసే డ్రస్సులు, యాక్ససరీస్ డిజైనింగ్ ని సుష్మిత పూర్తి చేసింది. ఆ విషయాన్నీ ఆమె స్వయంగా శుక్రవారం ట్విట్టర్లో వెల్లడించింది. ఫోటోని కూడా పోస్ట్ చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus