Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

  • March 29, 2026 / 09:05 AM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ప్రియదర్శి (Hero)
  • ద్రిషిక చందర్ (Heroine)
  • సాయి కుమార్, రాజశ్రీ నాయర్,విష్ణు ఓఐ, దేవి ప్రసాద్, ప్రభాకర్, ప్రేమ తదితరులు (Cast)
  • వై.ఎస్.మాధవ్ రెడ్డి (Director)
  • బోసు బాబు నిడుమోలు (Producer)
  • జయ్ క్రిష్ (Music)
  • కార్తీక్ కొప్పెర (Cinematography)
  • చోట కె ప్రసాద్ (Editor)
  • Release Date : మార్చి 27 2026
  • ప్రజ్వల లైన్ క్రియేషన్స్ (Banner)

‘మల్లేశం’ ‘బలగం’ ‘కోర్ట్’ వంటి విభిన్న కథా చిత్రాలతో సూపర్ హిట్లు అందుకున్నాడు ప్రియదర్శి. ఆ సినిమాలతో మార్క్ చాటుకున్నాడు…మార్కెట్ కూడా ఏర్పరుచుకున్నాడు. అయితే ‘కోర్ట్’ తర్వాత ప్రియదర్శి చేసిన ‘మిత్రమండలి’ ‘ప్రేమంటే’ వంటి సినిమాలు ఎప్పుడొచ్చాయో ఎప్పుడు వెళ్ళిపోయాయో చాలా మందికి తెలీదు అంటే అతిశయోక్తి అనిపించుకోదు. ఇదిలా ఉంటే..ప్రియదర్శి నటించిన ‘సుయోధన’ అనే చిత్రం ఈ వారం సడన్ ఎంట్రీ ఇచ్చింది. ప్రమోషనల్ కంటెంట్ అయితే ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. మరి సినిమా ఏ మేర ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి:

Suyodhana Movie Review

కథ: వరుణ్(ప్రియదర్శి) సినిమాలకి సౌండ్ డిజైనర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతని తండ్రి ప్రకాష్(సాయి కుమార్) ఓ రాజకీయ నాయకుడు. తల్లి రాధకి(రాజశ్రీ నాయర్) వరుణ్ అంటే ప్రాణం. తర్వాత అనుకోకుండా అతనికి సంమిత( ద్రిషిక చందర్) అనే అసిస్టెంట్ డైరెక్టర్ కమ్ కాస్టింగ్ డైరెక్టర్ పరిచయమవుతుంది. కొద్దిరోజులకే వీరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. అయితే వరుణ్ కి ఒక డిసార్డర్ ఉంటుంది. అదేంటంటే.. అతనికి ఎవరినుండైనా ప్రాణ హాని ఉందనుకుంటే అతనికి ‘సుయోధన.. సుయోధన’ అంటూ ఓ స్వరం వినిపిస్తుంది. అది విన్న తర్వాత ఏ వ్యక్తి నుండి అతనికి ప్రమాదం ఉందో అతను దుర్యోధనుడి రూపంలో కనిపిస్తాడు. చిన్నప్పటి నుండి వరుణ్ కి ఎటువంటి ప్రమాదం ఎదురైనా ఇలాగే జరుగుతుంది.

అయితే ఒకసారి వరుణ్ తండ్రి ప్రకాష్ కూడా అతనికి దుర్యోధనుడిలా కనిపిస్తాడు. దీంతో ‘తండ్రి నుండి తనకి ప్రాణ హాని ఉందేమో’ అనే అయోమయానికి గురవుతాడు వరుణ్. అయితే ఆ అనుమానం కలిగిన కాసేపటికే తండ్రి ప్రకాష్ హత్యకి గురవుతాడు? ఆ హత్య చేసింది వరుణ్ అని భావించి పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. ప్రకాష్ ని చంపింది ఎవరు? వరుణ్ ఈ కేసు నుండి ఎలా బయటపడ్డాడు? అతనికి ప్రకాష్ స్నేహితుడు భూషణం(దేవి ప్రసాద్) ఎలా సాయపడ్డాడు? అసలు వరుణ్ కి ఉన్న డిసార్డర్ కి మహతికి(ప్రేమ) ఉన్న సంబంధం ఏంటి? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: ప్రియదర్శి ఇప్పటివరకు ఎక్కువగా కామెడీ పాత్రలు, సెటిల్డ్ రోల్స్ తోనే ప్రేక్షకులను అలరించాడు. ఈ ‘సుయోధన’ లో మాత్రం అతని పాత్ర భిన్నంగా ఉంటుంది. ఓ కొత్త ప్రియదర్శిని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఇది ‘బలగం’ కి ముందు చేసిన సినిమా అనుకుంట. లుక్స్ లో ఆ తేడా స్పష్టంగా తెలుస్తుంది. ద్రిషిక చందర్ పాత్ర హీరోయిన్ కి తక్కువ సపోర్టింగ్ రోల్ కి ఎక్కువ అన్నట్టు ఉంటుంది. ఆమె నటన చెప్పుకోదగిన రేంజ్లో ఏమీ ఉండదు. సాయి కుమార్ ఎప్పటిలానే తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నాడు. రాజశ్రీ నాయర్ తనకి అలవాటైపోయిన తల్లి పాత్రలో ఒదిగిపోయింది. ఈ సినిమాలో ఆమెకు కొంచెం స్క్రీన్ స్పేస్ దక్కింది అని చెప్పాలి. ప్రేమ పాత్ర మొన్నామధ్య వచ్చిన ‘కిష్కింధపురి’లో ఆమె చేసిన పాత్రకి దగ్గరగా ఉంటుంది. దేవి ప్రసాద్ ఓకే అనిపిస్తాడు. హీరో సత్యదేవ్ చిన్న అతిధి పాత్రలో కనిపించి సర్ప్రైజ్ ఇచ్చాడు.

సాంకేతికవర్గం పనితీరు: కొన్ని కథలు పేపర్ పై చాలా బాగుంటాయి. వాటిని సరిగ్గా తెరకెక్కించకపోతే పేపర్ పై ఎంత బాగున్నా ఉపయోగం ఉండదు. ‘సుయోధన’ కూడా అలాంటిదే. కథ వింటుంటే ఎలాంటి ప్రేక్షకుడికైనా ఆసక్తి కలుగుతుంది. ఈ విషయంలో దర్శకుడు వై.ఎస్.మాధవ్ రెడ్డిని అభినందించాల్సిందే. కథకుడిగా అతను సక్సెస్ అయ్యాడు. కానీ దర్శకుడిగా మాత్రం నిరాశపరిచాడు అనే చెప్పాలి. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఇది ‘బలగం’ కి ముందు రూపొందిన సినిమా అయ్యుండొచ్చు.ఎలా చెప్పొచ్చంటే.. సినిమాలో ఒకటి రెండు చోట్ల 2000 రూపాయల నోట్లు వాడారు. వాస్తవానికి వాటిని 2023 జూన్ టైంలో రద్దు చేశారు.

అనేక కారణాల వల్ల ‘సుయోధన’ సినిమా షూటింగ్ ఆలస్యమైంది అని మేకర్స్ కూడా చెప్పడం జరిగింది. అందువల్ల కథనంలో కూడా ఏవైనా మార్పులు చోటు చేసుకుని ఉండొచ్చు. ఇలాంటి కథకి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అవసరం. అప్పుడే ప్రేక్షకులు అటెన్షన్ పే చేసి చూస్తారు. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు. కానీ సెకండాఫ్ లో దర్శకుడు సస్పెన్స్ అనుకుని రాసిన సన్నివేశాలను ప్రేక్షకుడు ముందుగానే పసిగట్టేస్తాడు.కాబట్టి థ్రిల్ ఫీలవ్వలేడు. దేవి ప్రసాద్ క్యారెక్టర్ కి పెట్టిన ట్విస్ట్ ని కూడా ఆడియెన్స్ ఇట్టే కనిపెట్టేస్తారు అనడంలో సందేహం లేదు. దర్శకుడు ఈ విషయాల్లో జాగ్రత్త పడి ఉంటే కచ్చితంగా ఈ ‘సుయోధన’ స్థాయి వేరుగా ఉండేది. ప్రొడక్షన్ వాల్యూస్ కి పేరు పెట్టనవసరం లేదు. విజువల్స్ క్వాలిటీగానే ఉన్నాయి. మ్యూజిక్ పర్వాలేదు.

విశ్లేషణ: ‘సుయోధన’ లో ఓ థ్రిల్లర్ సినిమాకి సరిపడా కంటెంట్, సెటప్ ఉన్నాయి. కానీ ప్రెడిక్టబుల్ నెరేషన్, సెకండాఫ్ లో ల్యాగ్ ఉండటం వల్ల థ్రిల్ ఫ్యాక్టర్ మిస్ అవుతుంది. ఓటీటీ ఆడియన్స్ అయితే ఈ సినిమాకి పాస్ మార్కులు వేయొచ్చేమో.

ఫోకస్ పాయింట్: థ్రిల్ చేయలేదు ‘సుయోధన’

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Drishika Chanda
  • #Priyadarshi
  • #Saikumar
  • #Suyodhana Movie

Reviews

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

9 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

11 hours ago

latest news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

6 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

1 day ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version