మళ్ళీ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన స్వరభాస్కర్

విషయం ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడే నటీమణుల్లో స్వరా భాస్కర్‌ ఒకరు. ఆమె తాజాగా తన సినీ కెరీర్‌లో ఎదురైన ఓ చేదు సంఘటన గురించి పంచుకున్నారు. ఓ సందర్భంలో క్యాస్టింగ్‌ కౌచ్‌ నుంచి తప్పించుకున్నానని పేర్కొన్నారు. ఓ నిర్మాత నుంచి తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ‘నాతో ఓ నిర్మాత అసభ్యంగా ప్రవర్తించాడు. నా చెవిపై ముద్దుపెట్టడానికి ప్రయత్నించాడు. నా వెనుక నిల్చొని ‘ఐ లవ్‌ యు బేబీ’ అని చెప్పాడు. నేను పక్కకు తప్పుకొని, వెళ్లిపోయా. ఇదంతా క్యాస్టింగ్‌ కౌచ్‌లో భాగమే కదా?’ అంటూ ఆమె గుర్తు చేసుకున్నారు.

సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’ సినిమాతో స్వరా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఆమె నటించిన ‘వీరే ది వెడ్డింగ్‌’ విడుదలైంది. ఆమెతోపాటు సోనమ్‌ కపూర్‌, కరీనా కపూర్‌, శిఖా తలసానియా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శశాంక్‌ ఘోష్‌ దర్శకత్వం వహించారు. కథానాయిక ప్రాధాన్యంగా తెరకెక్కిన ఈ సినిమా విజయం అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లు రాబట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. తెలుగు హిట్‌ ‘ప్రస్థానం’ను అదే టైటిల్‌తో హిందీలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సంజయ్‌ దత్‌, మనీషా కొయిరాలాతోపాటు స్వరా కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus