మహేష్ క్యారెక్టర్ ను రివీల్ చేసిన కలర్స్ స్వాతి

  • December 20, 2018 / 12:22 PM IST

గతంలో ‘మా’ టీవీ లో ప్రసారమయ్యే ‘కలర్స్’ ప్రోగ్రాం తో ఎంతో పాపులర్ అయ్యింది స్వాతి. ‘కలర్స్’ నే ఇంటిపేరుగా మార్చేసుకుని ‘కలర్స్ స్వాతి’ అయ్యింది. నేచురల్ స్టార్ నానితో ‘అష్టా చమ్మా’ నిఖిల్ తో ‘స్వామి రారా’ ‘కార్తికేయ’ వంటి చిత్రాలతో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది . టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా హెరాయిన్ గా రాణించింది స్వాతి. గత కొంత సినిమాలకు కాస్త దూరంగా ఉన్న స్వాతి… తాజాగా రానా హోస్ట్ గా చేస్తున్న ‘నెంబర్ 1 యారి విత్ రానా’ షో కి విచ్చేసిన సంగతి తెలిసిందే. హీరో నిఖిల్ తో కలిసి స్వాతి ఈ షో లో పాల్గొంది.

ఈ షోలో రానా అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు స్వాతి, నిఖిల్. ఇందులో రానా స్వాతిని నిన్ను బాగా హర్ట్ చేసిన కామెంట్ ఏంటి ? అని ఆగిన ప్రశ్నకు స్వాతి సమాధానమిస్తూ.. ఇండస్ట్రీ లో హీరోయిన్స్ గురించి బయట ఒక బ్యాడ్ టాక్ ఉంది. హీరోయిన్స్ అందరిదీ లూజ్ క్యారెక్టర్ అని హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఎవడితో పడితే వాడితో పడుకుంటారనీ… ఇది నాకు బాధ కలిగించే విషయమని చెప్పింది. ఇక వేల నుంచీ ఒక క్వాలిటీ తీసుకువాలంటే అనే ప్రశ్నకు.. స్వాతి సమాధాన మిస్తూ .. పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ అంటే ఇష్టం.. ఆయనలా ఉండాలనిపిస్తుంది. ఇక మహేష్ బాబు బయట చాలా కామ్ అనుకుంటారు కాని.., ఆయన తో వర్క్ చేసిన వారికి తెలుస్తుంది… ఆయన చాలా వేటకారం, ఇతరుల పై జోకులు వేయడం… అంత చమత్కారి అయినప్పటికీ ‘సైలెంట్’ అనే ట్యాగ్ ఉంది అలాంటి ఇమేజ్ ను సొంతం చేసుకోవడం చాలా గొప్ప విషయం … అలాంటి క్వాలిటీ మహేష్ నుండి తీసుకోవాలనుకుంటాను అంటూ చెప్పింది. ఇక ఎన్టీఆర్ ట్యాలెంట్, ప్రభాస్ హైట్, రానా నుండి లవ్వింగ్ నేచర్ నేను తీసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus