మరోసారి బిగ్ బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్వేతా రెడ్డి

గత కొంతకాలంగా మాజీ యాంకర్ శ్వేతారెడ్డి ‘బిగ్ బాస్’ షో పై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ‘నాతో అగ్రిమెంట్ చేయించుకొని.. చివరి నిమిషంలో తప్పించారని.. నన్ను లైంగికంగా వేధించారంటూ’ ఆరోపణలు చేసింది శ్వేతారెడ్డి. అంతేకాదు సుమారు 150 మందితో బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదింపులు జరిపారని.. వాళ్ళందరినీ మోసం చేశారని కూడా ఆరోపణలు చేసింది. అక్కడితో ఆగకుండా.. ‘బిగ్ బాస్’ పై పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఇక ఇటీవల వైజాగ్ లోని మహిళా మండలి సభ్యుల సౌజన్యంతో ధర్నా మొదలు పెట్టే ప్రయత్నం చేసింది. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా ధర్నాను రద్దు చేసి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.

ఈ ప్రెస్ మీట్లో ఆమె మాట్లాడుతూ… ‘ఎంపిక విషయంలో అన్యాయం జరగడం ఒక్కటే కాదు.. వాళ్ళు అడిగిన ప్రశ్నలు కూడా చాలా అసభ్యకరంగా ఉన్నాయి.నా విషయంలో ‘బిగ్ బాస్’ ని ఎలా సాటిస్ఫై చేస్తారు అడిగారు.. పదే పదే అదే ప్రశ్న అడగడంతో నాకు చిరాకొచ్చింది. ఇదొక రియాలిటీ షో. అక్కడ ఎవరి టెంపర్ ఎలా ఉంటుంది..? మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది..? టాస్క్ లు ఇచ్చినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందనే వాటి పై ప్రశ్నలు అడగాలి కానీ సెక్సుల గురించి, హగ్గుల గురించి, ముద్దుల గురించి అడగడమేంటి. తొంబై రోజులు సెక్స్ లేకుండా మీరు ఎలా మేనేజ్ చేయగలరనే..? చెత్త ప్రశ్నలను అడుగుతున్నారు. నాతో పాటు గాయత్రీ గుప్తా, శ్రీరెడ్డిలను కూడా అలాగే అడిగారంటూ మండిపడింది. ఈ పోరాటం తీవ్ర రూపం దాల్చబోతోంది, ఇది పబ్లిసిటీ స్టంట్ కాదు’ అంటూ చెప్పుకొచ్చింది శ్వేతా రెడ్డి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus