హీరోయిన్ ధన్షికని ఏడ్చేసిన స్టార్ హీరో తండ్రి!!

  • September 29, 2017 / 12:20 PM IST

కోలీవుడ్ లో ప్రముఖ నటుడు, దర్శకుడు టి. రాజేందర్ మరో వివాదానికి కేంద్రమయ్యారు. ‘విళితిరు’ సినిమాలో ధన్షిక హీరోయిన్ గా నటించింది. చిత్ర నిర్మాతలు తాజాగా ఈ సినిమా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో ప్రసంగిస్తూ అందులో పని చేసిన అందరి గురించి ప్రస్తావించిన ధన్షిక… రాజేందర్ పేరు ప్రస్తావించడం మరచిపోయింది. దీనిని అవమానంగా భావించిన ఆయన వేదికపైనే ఆమెకు చీవాట్లు పెట్టారు, దీంతో ధన్షిక వేదికపైనే ఏడ్చేసింది. పొరపాటున మరచిపోయానని చెప్పినా రాజేందర్ లక్ష్యపెట్టలేదు. సారీ చెప్పినా కనికరించలేదు.

కబాలి సినిమాలో నటించినంత మాత్రాన రజినీకాంత్‌ తో కబాలి సినిమాలో నటించినంత మాత్రాన స్టార్ హీరోయిన్లు అయిపోరని, పెద్దలను గౌరవించాలని హితవు పలికారు. దీంతో షాక్ తిన్న ధన్షిక వెంటనే తను చేసిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ, స్టేజ్ పై ప్రసంగించడం తనకు అలవాటు లేదని చెప్పి క్షమించాల్సిందిగా కోరింది. అయినా కనికరించని రాజేందర్.. చీరలో రాని నువ్వు.. సారీ చెప్తున్నావని చీవాట్లు పెట్టారు. నువ్విచ్చే గౌరవాన్ని తాను ఏ మార్కెట్లో అమ్ముకుంటానని కొట్టిపారేశారు. దీంతో ఖిన్నురాలైన ధన్షిక కన్నీటిపర్యంతమైంది. ఇంతకీ ఈ సినిమాలో టి.రాజేందర్ నటించలేదు… కేవలం ఒక పాట మాత్రమే పాడారు. ధన్షిక పొరపాటు చేశానని సారీ చెప్పిన తర్వాత కూడా రాజేందర్ ఆమెను దుర్భాషలాడినంత పనిచేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ నటుడు రాజేందర్ సంయమనం పాటించి ఉండాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus