కె రాఘవేంద్రరావుకి క్షమాపణలు చెప్పిన తాప్సి

  • July 15, 2017 / 05:55 AM IST

ఢిల్లీ భామ తాప్సి  ఝుమ్మంది నాదం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. హీరోయిన్ గా అ వకాశమించిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుని విమర్శించింది. “వందకు పైగా సినిమాలు చేసిన రాఘవేంద్రరావు హీరోయిన్ ల బొడ్డు మీద పువ్వులు, పండ్లు వేయడం ఏంటో ? నాకు ఇప్పటికీ అర్థం కాలేదని, అలా వేస్తేనే హీరోయిన్ల అందాలు బయట పడతాయా?” అని ఓ ఇంటర్వ్యూ లో హేళన చేసింది. దీనిపై తెలుగు పరిశ్రమలోని నటీనటులు, టెక్నీషయన్లు, ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్ పెద్దలు.. తాప్సి పై నిషేధం విధించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం  తెలుసుకున్న తాప్సి విమర్సలను వెనక్కు తీసుకుంది.

రాఘవేంద్రరావు పై చేసిన కామెంట్స్ ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని, సరదాగా ఓ షోలో చెప్పానని, అవి ఎవరినైనా బాధ కలిగించి ఉంటే క్షమించాలని కోరింది. రెండు నిముషాలు పాటు ఆమె మాట్లాడిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ వివాదానికి తెరదించింది. తాప్సి సారీ చెప్పడంతో తెలుగు సినీపెద్దలు, అభిమానులు శాంతించారు. ఇక తాప్సి చాలా గ్యాప్ తర్వాత నటించిన “ఆనందో బ్రహ్మ” వచ్చే నెలల్లో రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus