టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో గుర్తింపును కలిగి ఉన్న హీరోయిన్లలో తాప్సీ ఒకరు కాగా ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ చేసిన తాప్సీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నా కళ్లు పెద్దగా, చూడచక్కగా ఉండవని అమె అన్నారు. ముక్కు, పెదవులు కూడా అంత అందంగా కనిపించవని తాప్సీ పేర్కొన్నారు. జుట్టు కూడా రింగులు రింగులుగా ఉంటుందని ఆమె వెల్లడించారు. మొదట సెలూన్ కు వెళ్లి జుట్టును అందంగా మార్చుకోవడం కోసం రకరకాల ఉత్పత్తులను వాడానని వాటి వల్ల జుట్టు రాలడంతో మళ్లీ వాటి జోలికి పోలేదని పేర్కొన్నారు.
అప్పటినుంచి అందంపై నా అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని తాప్సీ వెల్లడించారు. నా డైటీషియన్ వేతనం లక్ష రూపాయలు అని ఫిట్ గా ఉండాలనే ఆలోచనతో డైటీషియన్ కోసం ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నానని ఆమె తెలిపారు. కెరీర్ తొలినాళ్లలో తెలుగులో నేను నటించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో అందరూ నన్ను ఐరన్ లెగ్ అని కామెంట్ చేసేవారని తాప్సీ అన్నారు.
తొమ్మిదో తరగతిలో నా ఫస్ట్ రిలేషన్ మొదలైందని అది ఎక్కువ రోజులు కొనసాగలేదని ఆమె కామెంట్లు చేశారు. పదో తరగతికి రాగానే చదువుపై దృష్టి పెట్టాలని భావించి అతడు నన్ను దూరం పెట్టేవాడని తాప్సీ కామెంట్లు చేశారు. అతడి జ్ఞాపకాల నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టిందని తొలిప్రేమ ఎప్పటికీ మధుర జ్ఞాపకమేనని తాప్సీ చెప్పుకొచ్చారు.
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒక సినిమాలో నేను భాగం కావడం ఆ హీరో భార్యకు నచ్చలేదని నన్ను హఠాత్తుగా ఈ సినిమా నుంచి తప్పించారని తాప్సీ వెల్లడించారు. నా కెరీర్ లో ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయని తాప్సీ కామెంట్లు చేశారు. తాప్సీ (Taapsee Pannu) చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!