Taapsee Pannu: పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సీ.. ఏం జరిగిందంటే?

  • July 27, 2024 / 11:43 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో తాప్సీ (Taapsee Pannu) ఒకరు కాగా ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీకే పరిమితం అయ్యారనే సంగతి తెలిసిందే. తాప్సీ పెళ్లి తర్వాత కూడా వరుస ప్రాజెక్ట్ లతో బిజీ అవుతూ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. తాప్సీ ప్రస్తుతం ఖేల్ ఖేల్ మే అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా నుంచి తాజాగా హాలి హాలి అనే పాట విడుదలైంది. ఈ ఈవెంట్ నుంచి తిరిగొస్తున్న సమయంలో తాప్సీకి ఫోటోగ్రాఫర్ శుభాకాంక్షలు చెప్పగా సినిమా రిలీజ్ కాకముందే హిట్టైందా అని ఆమె ప్రశ్నించారు.

ఆ ప్రశ్నకు ఫోటోగ్రాఫర్ బదులిస్తూ పెళ్లి శుభాకాంక్షలు తెలియజేశానని తెలిపారు. ఫోటో గ్రాఫర్ పెళ్లి శుభాకాంక్షలు తెలియజేశానని చెప్పడంతో నాకు పెళ్లైందనే విషయమే మరిచిపోయానని తాప్సీ రియాక్ట్ అయ్యారు. ఈ ఏడాది మార్చి నెలలో తాప్సీ పెళ్లి జరిగింది. ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోను ఆమె పెళ్లి చేసుకున్నారు. తాప్సీ ఫన్నీగా చెప్పిన ఈ జవాబు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

తాప్సీ నటించిన ఫిర్ ఆయి హసీన్ దిల్ రుబా ఆగష్టు నెల 9వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తాప్సీ కెరీర్ పరంగా మరింత ఎదగడంతో పాటు మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. తాప్సీ రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లోనే ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అంతకంతకూ ఎదుగుతున్న తాప్సీ విభిన్నమైన పాత్రలను ఎంచుకోవడం ఆమెకు ప్లస్ అయింది.

తాప్సీకి తెలుగులో ఆఫర్లు రావడం కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తాప్సీ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోవడానికి పడిన కష్టం మాత్రం అంతాఇంతా కాదు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో బిజీ అవుతున్న తాప్సీ తన లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో సైతం తాప్సీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus