షార్ట్ ఫిలిమ్ కోసం తాప్సీ రిస్క్!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ అందరూ సినిమాల కంటే ఎక్కువగా డిజిటల్ కంటెంట్ మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. హాలీవుడ్ లో మొదలైన ఈ సంస్కృతి అనంతరం బాలీవుడ్ కి పాకింది, ఇప్పుడు టాలీవుడ్ కు విస్తరిస్తోంది. అందుకే మన కథానాయికలందరూ కూడా షార్ట్ ఫిలిమ్స్ & వెబ్ సిరీస్ ల వైపు దృష్టి సారిస్తున్నారు. రాధికా ఆప్టే, శ్రద్ధా దాస్ లు ఈ ఫార్మాట్ ను స్టార్ట్ చేయగా.. ఇప్పుడు కొత్తగా తాప్సీ ఈ రేస్ లో జాయిన్ అయ్యింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న తాప్సీ తన స్నేహితుడు తీస్తున్న ఒక షార్ట్ ఫిలిమ్ లో యాక్ట్ చేయడానికి సిద్ధమైంది.

ఆడపిల్లలపై జరుగుతున్న ఆకృత్యాల నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ షార్ట్ ఫిలిమ్ లో తాప్సీ ఒక రేప్ విక్టిమ్ గా నటించనుంది. చైల్డ్ ట్రాఫిక్కింగ్ మొదలుకొని ప్రాస్టిట్యూషన్ వరకూ అన్నీ విషయాలనూ ఈ షార్ట్ ఫిలిమ్ లో వివరించి, చర్చించనున్నారట. “పింక్”లో తాప్సీకే ఈ తరహా విక్టిమ్ గా నటించిన తర్వాతే మంచి పేరు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఈ షార్ట్ ఫిలిమ్ తో మరోమారు రేప్ విక్టిమ్ గా ప్రేక్షకుల్ని పలకరించబోతున్న తాప్సీని నెటిజన్లు ఎలా రిసీవ్ చేసుకొంటారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus