పెళ్లి చేసుకోవడం గురించి స్పందించిన డిల్లీ బ్యూటీ తాప్సీ

  • June 11, 2019 / 06:03 PM IST

సౌత్ నుంచి నార్త్ వెళ్ళి సక్సెస్ ఫుల్ గా స్థిరపడిన కథానాయికల్లో తాప్సీ ఒకరు. ఆమెకంటే ముందు మన సౌత్ హీరోయిన్లు చాలామంది బాలీవుడ్ లో స్థిరపడేందుకు ప్రయత్నించినా పెద్దగా ఫలితం లేకపోయింది. కానీ తాప్సీ మాత్రం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతోపాటు కమర్షియల్ సినిమాలు కూడా చేస్తూ బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. ఏదైనా పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ ఉంది అనుకుంటే దర్శకులు ఆమెను ఒక ఆప్షన్ గా కన్సిడర్ చేస్తున్నారంటే ఆమె కథానాయికగా ఎంతటి విజయం సాధించిందో అర్ధం చేసుకోవచ్చు.

ఆమె తాజా చిత్రం “గేమ్ ఓవర్” ఈ శుక్రవారం విడుదలకు సిద్ధమవుతోంది. తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు హిందీలోనూ డబ్బింగ్ రూపంలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన తాప్సీ తన భవిష్యత్ ప్రణాళికల గురించి చాలా క్లారిటీతో మాట్లాడింది. ముఖ్యంగా తనకు అసలు పెళ్లి చేసుకొనే ఆలోచన లేదని, కానీ తనకోక పార్ట్నర్ కావాలని అది కూడా కేవలం తాను భవిష్యత్ లో మొదలెట్టనున్న ప్రొడక్షన్ హౌస్ కోసమని చాలా క్లియర్ గా చెప్పింది తాప్సీ. మరి తాప్సీకి అలాంటి పార్ట్నర్ దొరుకుతాడో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus