Taapsee: వైరల్ అవుతున్న హీరోయిన్ తాప్సీ సంచలన వ్యాఖ్యలు!

  • April 18, 2023 / 04:59 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో తాప్సీ ఒకరు కాగా ప్రస్తుతం ఈ హీరోయిన్ బాలీవుడ్ కే పరిమితమైన సంగతి తెలిసిందే. గతంలో సౌత్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన తాప్సీ తాజాగా మరోమారు సౌత్ ఇండస్ట్రీ గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. సౌత్ ఇండస్ట్రీ సినిమాల ద్వారా తనకు స్టార్డమ్ వచ్చిందని అయితే నటిగా నాకు సంతృప్తి దొరకలేదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. సౌత్ లో సంతృప్తి దొరకకపోవడం వల్లే తాను బాలీవుడ్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టడం జరిగిందని ఆమె కామెంట్లు చేశారు.

పింక్ మూవీ తన కెరీర్ లో గొప్ప మలుపు తిప్పిందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. బాలీవుడ్ ఇండస్ట్రీలో కథల ఎంపికలో తాను కీలక నిర్ణయాలు తీసుకున్నానని ఆ నిర్ణయాలు మంచి ఫలితాలు మిగిల్చాయని తాప్సీ కామెంట్లు చేశారు. తన సినిమా చూడటానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు డబ్బులతో పాటు సమయం వృథా చేసుకోకూడదని తాప్సీ పేర్కొన్నారు. నా ప్లేస్ లో భర్తీ చేయడం సులువు కాదని తాప్సీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

తాను ప్రస్తుతం చాలా సంతృప్తితో ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు. తన సినీ కెరీర్ లో గొప్పగా చెప్పుకునే సినిమాలు ఉన్నాయని తాప్సీ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాప్సీ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పది సంవత్సరాలు అయిన సంగతి తెలిసిందే. తాప్సీ రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉందని బోగట్టా.

తాప్సీ (Taapsee) ఇతర హీరోయిన్లకు భిన్నంగా అడుగులు వేస్తూ సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తాప్సీ సౌత్ పై పదేపదే విమర్శలు చేయడం వల్ల అభిమానులకు ఆమె దూరమవుతున్నారు. సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మాత్రమే తాప్సీ కెరీర్ పరంగా మళ్లీ బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సోషల్ మీడియాలో మాత్రం తాప్సీకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus