కూతురు భర్తతో ఎఫైర్.. నటిపై నెటిజన్ల ట్రోల్స్..?

  • March 27, 2021 / 08:05 PM IST

సినిమా రంగంలో హీరోలు, హీరోయిన్లు నటులుగా ప్రూవ్ చేసుకోవడం కోసం కొన్ని సందర్భాల్లో ఎలాంటి రోల్స్ లోనైనా నటించడానికి సిద్ధంగా ఉండాలి. విభిన్నమైన పాత్రల ద్వారా చాలా సందర్భాల్లో ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని పాత్రలు మాత్రం ప్రశంసల కంటే విమర్శలనే తెచ్చిపెడతాయి. తాజాగా టబు బోల్డ్ రోల్ లో నటించడానికి సిద్ధం కాగా ఆ పాత్రలో టబు నటించడం ఫ్యాన్స్ కు నచ్చడం లేదు.

తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి గుర్తింపును సంపాదించుకున్న టబు భూల్ భూలయ్య 2 సినిమాలోని ఒక పాత్ర కోసం ఎంపికయ్యారు. టబు ఈ మూవీలో అల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకునే పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. టబు సినిమా కోసం ఇలాంటి పాత్రను ఎంచుకున్నారని తెలిసి నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో టబు ఎక్కువగా బోల్డ్ రోల్స్ లో నటిస్తుండగా ఆమె అలా బోల్డ్ రోల్స్ లో నటించడంపై కూడా అభిమానుల నుంచి తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించిన టబు సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి పేరు తెచ్చిపెట్టే పాత్రలను ఎంచుకుంటే మంచిది. ప్రత్యేకమైన పాత్రలు చేసినా ఇలాంటి పాత్రలు మాత్రం చేయవద్దని ఆమె అభిమానులు కోరుతున్నారు. కొన్ని నెలల క్రితం టబు ఏ సూటబుల్ బాయ్ అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఈ వెబ్ సిరీస్ లో తన కంటే చిన్న వయస్సు వ్యక్తి అయిన ఇషాన్ ఖట్టర్ తో కలిసి టబు బెడ్రూమ్ సీన్స్ లో నటించారు. నెటిజన్లు తిట్టిపోస్తున్న నేపథ్యంలో టబు ఇకపై పాత్రల ఎంపిక విషయంలో జాగ్రత్త వహిస్తారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus