తమన్నా, ప్రభుదేవా హారర్ చిత్రం ‘అభినేత్రి’..

  • March 31, 2016 / 11:11 AM IST

తమన్నా, ప్రభుదేవా, సోనూసూద్ ప్రధాన పాత్రల్లో నటించనున్న చిత్రం ‘అభినేత్రి’. హారర్ కామెడీ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘దివా తిరుమగల్’ ఫేమ్ విజయ్ దర్శకత్వం వహించనున్నారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, బ్లూ సర్కిల్ కార్పొరేషన్, బి‌ఎల్‌ఎన్ సినిమా పతాకంపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  త్రిభాషా చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. ఈ చిత్రంలోని తమన్నా పాత్ర కాంత పేరునే తమిళ చిత్ర టైటిల్ గా ఖరారు చేసినట్లు సమాచారం. జి‌వి ప్రకాష్ కుమార్, తమన్ ఈ చిత్రానికి సంయుక్తంగా స్వరాలు అందించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. దాదాపు 12 సంవత్సరాల తరువాత కాంత చిత్రం ద్వారా ప్రభుదేవా తమిళ ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus