దక్షిణాది సినీ పరిశ్రమలోనే కాకుండా హిందీలోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న నటి తమన్నా. అందం, అభినయంతో ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది. ఇప్పుడు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కిన ‘అభినేత్రి’ చిత్రంలో టైటిల్ రోల్ పోషించింది. ఈ చిత్రం హిందీ, తమిళంలో డెవిల్ గా రిలీజ్ కానుంది. ప్రభుదేవా, తమన్నా కాంబినేషన్లో విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అక్టోబర్ 7న విడుదలవుతుంది.
ఈ మూవీ తరవాత తమన్నా పెళ్లి చేసుకోనున్నట్లు కొంత కాలంగా వార్త చక్కర్లు కొట్టింది. ‘అభినేత్రి’ ప్రచారంలో భాగంగా మీడియా ముందుకు వచ్చిన ఆమె తన పెళ్లి వార్తలను ఖండించింది. “నేను ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాను. ఈ సమయంలో పెళ్లి చేసుకోను. మరో రెండేళ్ల పాటు ఆ ఆలోచన నాకు లేదు” అని పాల బుగ్గల సుందరి స్పష్టం చేసింది.