సిక్స్ ప్యాక్ రప్పించిన తమిళ కమెడియన్!

విశాల్ సినిమాల ద్వారా తమిళ కమెడియన్ సూరి తెలుగువారికి బాగా పరిచయమే. రీసెంట్ గా హీరో కార్తీ తో చినబాబులో కలిసి నటించి నవ్వులు పూయించారు. అలా తెలుగులో, తమిళంలో క్రేజీ కమెడియన్ గా పేరుతెచ్చుకున్న సూరి.. సునీల్ బాటలో నడుస్తున్నారు. ఎలాగంటే.. సునీల్ హాస్యనటుడి  నుంచి హీరోగా ప్రమోషన్ అందుకున్న తర్వాత పూల రంగడు సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో ఆకట్టుకున్నారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సినిమాలు హిట్ కాకపోవడంతో ఇప్పుడు హాస్య నటుడిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇది వేరే విషయం అనుకోండి. సునీల్ మాదిరిగానే సూరి సిక్స్ ప్యాక్ బాడీ రప్పించారు.

శివ కార్తికేయన్, సమంత జంటగా నటించిన సీమ రాజు సినిమాలో సిక్స్ ప్యాక్ లో కనిపిస్తాడని సమాచారం. ఇప్పటికే సూరి సిక్స్ ప్యాక్ ఫోటోలు కోలీవుడ్ లో సంచలనం రేపుతున్నాయి. అయితే ఈ సినిమా కోసమే సిక్స్ ప్యాక్ ట్రై చేశారా? లేకుంటే హీరో గా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనేది బయటికి రాలేదు. కమెడియన్ కి సిక్స్ ప్యాక్ అవసరం లేదు.. అయినా కష్టపడ్డారంటే.. దానివెనుక బలమైన కారణమే ఉంటుందని కోలీవుడ్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. త్వరలోనే ఈ సందేహనికి సమాధానం దొరకనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus