నాగబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన తమ్మారెడ్డి!

RRRసినిమా విషయంలో తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన వ్యాఖ్యల కారణంగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలోనే తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలపై పలువురు సినీ సెలబ్రిటీలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యంగా మెగా బ్రదర్ నాగబాబు తమ్మారెడ్డిని టార్గెట్ చేస్తూ ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలోనే నాగబాబు చేసిన వ్యాఖ్యలపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందిస్తూ నాగబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ తాను ఏమాత్రం తప్పుగా మాట్లాడలేదని తాను ఎవరికి క్షమాపణలు చెప్పనని తెలియజేశారు.

ఒక చిన్న సినిమా గురించి తాను మూడు గంటల పాటు మాట్లాడితే ఒక చిన్న క్లిప్ ఆధారంగా తనను విమర్శించడం సరికాదని తెలిపారు. రెండు రోజుల క్రితం తాను RRR సినిమా గురించి ఎంతో గొప్పగా మాట్లాడాను కానీ దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదు.ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళు కామెంట్స్ చేసిన నేను పట్టించుకోను కానీ ఇండస్ట్రీకి చెందిన పెద్దవాళ్లు తనను విమర్శించడం సరికాదని తెలిపారు. కొందరు నీకేం లెక్కలో తెలుసు అని మాట్లాడుతున్నారు నాకు లెక్కలు తెలియాల్సిన అవసరం లేదు.

అయితే చాలామంది అకౌంట్స్ నాకు తెలుసని,ఎవరెవరు ఏ అవార్డులు, పదవుల కోసం ఎవరెవరిని ఏమేం అడుక్కున్నారో, ఎవరెవరి కాళ్లు పట్టారో అన్నీ నాకు తెలుసు. నేనిప్పుడు వీటి గురించి మాట్లాడితే ఇండస్ట్రీ పరువు పోతుంది ఇండస్ట్రీ నాకు తల్లితో సమానం అని తెలిపారు. ఇక ఒకరు మాట్లాడుతూ నీ అమ్మ మొగుడు అంటూ సంభోదించారు. నా అమ్మ మొగుడు నాకు సంస్కారం నేర్పించాడు. నాకు నీతిగా బతకడం, నిజం చెప్పడం నేర్పించాడు.

మీకు నేర్పించారా? మీకు నిజం తెలుసా? నిజం చెప్పగలరా మీరు? మీరు చేసిన నిజాలు ఏంటో చెప్తారా మీకు నా గురించి మాట్లాడే అంత హక్కు ఉందా అంటూ ఈయన సూటిగా ప్రశ్నించారు.తనను తిట్టిన వారికి కాస్తైనా సిగ్గుండాలి ఆకాశాన్ని చూస్తూ ఉమ్ము వేస్తే అది మన పైనే పడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటూ ఈ సందర్భంగా పరోక్షంగా నాగబాబును ఉద్దేశించి తమ్మారెడ్డి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus