తారక్ తర్వాతి సినిమా పేరు అదేనా ?

  • August 26, 2016 / 07:45 AM IST

అశోక్, ఊసరవెల్లి, టెంపర్ సినిమాలకు రచయితగా పనిచేసిన స్టార్ రైటర్ వక్కంతం వంశీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేయడానికి అంతా సిద్ధమైంది. తారక్ నటించిన తాజా చిత్రం జనతా గ్యారేజ్ సెప్టెంబర్ 1 న రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత నందమూరి ఆర్ట్స్ బ్యానర్లో సినిమా చేయనున్నాడు. హీరో, నిర్మాత కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్నకోసం రెమ్యునరేషన్ తీసుకోకుండా ఎన్టీఆర్ ఇందులో నటిస్తున్నాడు. అయితే సినిమా లాభాల్లో షేర్ ఇచ్చేందుకు కళ్యాణ్ రామ్ ఫిక్స్ అయ్యారు.

ఎమోషనల్ లవ్ థ్రిల్లర్ స్టోరీ కోసం ప్రత్యేక పేరును ఖరారు చేశారు. రెండు రోజుల క్రితం కళ్యాణ్ రామ్ ఫిల్మ్ ఛాంబర్ లో “దడ్కన్” అనే పేరును రిజిస్టర్ చేసినట్లు తెలిసింది. ఇది వక్కంతం వంశీ దర్శకత్వంలో యంగ్ టైగర్ చేయనున్న సినిమా కోసమేనని ఫిల్మ్ నగర్ వాసులు చెబుతున్నారు. మాస్ ఎంటర్ టైనర్ తర్వాత ప్రేమ కథను ఎంచుకొని తారక్ మరో హిట్ కి పునాది వేసాడని సినీ ప్రముఖులు భావిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ లో మొదలు కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus