మెగా హీరో కోసం నందమూరి విలన్!

  • May 2, 2016 / 02:36 PM IST

“అమరావతి” చిత్రంతో విలన్ గా మారి నంది అవార్డ్ సొంతం చేసుకొన్న తారకరత్న ఇటీవల “రాజా చెయ్యి వేస్తే” చిత్రంలో మరోమారు విలన్ గా ఆకట్టుకొన్నాడు. హీరోగా కెరీర్ ఎలాగో ఆశాజనకంగా లేదు కాబట్టి, ఇకపై విలన్ గానే కంటిన్యూ అవుదామని ఫిక్సయ్యాడు తారకరత్న.

దాంతో.. సాయిధరమ్ తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో తారకరత్నను ప్రతినాయకుడిగా ఎంపిక చేసుకొన్నారని తెలుస్తోంది. సాయి సరసన రకుల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus