సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే మరో రెండు సినిమాలు

  • June 19, 2018 / 04:05 PM IST

టాలెంట్ తోపాటు అదృష్టం కూడా కలిసి రావడంతో.. మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకొన్న తరుణ్ భాస్కర్.. ఆ సినిమా విడుదల సమయంలోనే ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్ కంపెనీలో మరో సినిమా తెరకెక్కించే అవకాశం సొంతం చేసుకొన్నాడు. “ఈ నగరానికి ఏమయింది?” అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం జూన్ 29న విడుదలవుతున్న విషయం తెలిసిందే. అయితే.. తాజా సమాచారం ప్రకారం సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే తరుణ్ భాస్కర్ మరో రెండు సినిమాలు సైన్ చేశాడని టాక్. “ఈ నగరానికి ఏమైంది?” అవుట్ పుట్ తోపాటు తరుణ్ మేకింగ్ స్టైల్ విపరీతంగా నచ్చేయడంతో సురేష్ బాబు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

నలుగురు స్నేహితుల కథగా తెరకెక్కిన “ఈ నగరానికి ఏమైంది?” ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఒకవేళ తరుణ్ గనుక ఈ సినిమాతో హిట్ కొట్టాడంటే మనోడికి పెరిగే క్రేజ్ తో సురేష్ ప్రొడక్షన్ నుంచి రాబోయే తదుపరి సినిమాల బిజినెస్ కూడా హాట్ కేక్ లా అయిపోతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus