పెళ్ళిచూపులు దర్శకుడి రెండో సినిమా రెడీ..

  • August 7, 2017 / 10:42 AM IST

దర్శకుడిగా తన పరిచయ చిత్రమైన “పెళ్ళిచూపులు”తో రాష్ట్రవ్యాప్తంగానే కాక నేషనల్ వైడ్ గా విపరీతమైన క్రేజ్ తోపాటు ఘనమైన పేరును కూడా సంపాదించుకొన్న తరుణ్ భాస్కర్ సరిగ్గా “పెళ్ళిచూపులు” సినిమా విడుదలైన సంవత్సరం తర్వాత తన సెకండ్ సినిమాకి సంబంధించిన ఎనౌన్స్ మెంట్ చేశాడు. అందరూ కొత్తవాళ్లతో రూపొందించనున్న ఈ చిత్రానికి సంబంధించిన క్యాస్టింగ్ కాల్ ను ఇటీవల ఎనౌన్స్ చేశాడు తరుణ్ భాస్కర్.

ఈ చిత్రానికి సంబంధించిన మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమా కథ స్వయానా తరుణ్ భాస్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోందట. తాను దర్శకుడు కావడం కోసం తరుణ్ భాస్కర్ పడిన ఇబ్బందులు, ఎదుర్కొన్న అవరోధాలు మొదలుకొని సినిమా తీసే అవకాశం సంపాదించుకోవడం వరకూ కొన్ని సంఘటనలు ఈ చిత్రంలో పొందుపరచనున్నాడట. మెయిన్ క్యాస్టింగ్ ఫిక్స్ అయిపోయిన ఈ సినిమాకి మిగతా నటీనటుల కోసమే ఈ క్యాస్టింగ్ కాల్ అని తెలుస్తోంది. మరి మొదటి చిత్రంతో నేషనల్ అవార్డ్ అందుకొన్న తరుణ్ భాస్కర్ రెండో సినిమాతో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయగలుగుతాడో లేక “సెకండ్ సిండ్రోమ్” అనే సినిమాటిక్ డిసీస్ తో తేలిపోతాడో చూద్దాం!


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus