ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని శాంతి పరిచిన తరుణ్ భాస్కర్

యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని శాంతిపరిచారు. ఎన్టీఆర్ ని స్వయంగా కలిసి వివాదానికి తెరలేపారు. వివరాల్లోకి వెళితే… తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం పెళ్ళిచూపులు ఆర్ధికంగా మంచి విజయం సాధించడంతో పాటు రెండు జాతీయ అవార్డులు అందుకుంది. ఆ సమయంలో అతను ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “ఐఫా అవార్డ్స్” వారు టీఆర్పీ రేటింగ్ కోసమే జనతా గ్యారేజ్ కి అవార్డు ఇచ్చారు. నాకు అవార్డు ఇవ్వడం కన్నా ఎన్టీఆర్ కి అవార్డు ఇవ్వడం వల్ల వారికీ ఆదాయం వస్తుంది” అని చెప్పారు. ఈ విషయాన్నీ ఎన్టీఆర్ అభిమానులు సీరియస్ గా తీసుకున్నారు. తరుణ్ భాస్కర్ పై వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. ఫ్యాన్స్ ఆగ్రహాన్ని గుర్తించిన తరుణ్ సోషల్ మీడియాలో స్పందించారు.

“ఎన్టీఆర్ సార్ గురించి తప్పుగా మాట్లాడినందుకు క్షమించండి. మీడియాతో ఎలా మాట్లాడాలో తెలియక అలా అనేశాను. ఇక నుంచి ఆ పొరపాటు చేయను. ఇంతటితో వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టండి. అంతేకాదు క్షమాపణలు చెబుతాను” అని తన పేస్ బుక్ అకౌంట్ లో ఎన్టీఆర్ అభిమానులు వేడుకున్నారు. కానీ వారి కోపం మాత్రం పూర్తిగా తగ్గలేదు. ప్రస్తుతం “ఈ నగరానికి ఏమైంది” సినిమాని తీశారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్న చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రచార కార్య క్రమంలో బిజీగా ఉన్న తరుణ్.. ఎన్టీఆర్ ని కలిసి..ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు. దీంతో తారక్ తరుణ్ ని క్షమించినట్లు అభిమానులు సంతృప్తి చెందారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus