SSMB28: మహేష్ 28 లో తరుణ్.. అసలు మేటర్ ఏంటి?

  • August 29, 2022 / 07:31 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడో చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు పెద్దగా విజయం సాధించింది లేదు. కానీ వీరి కాంబినేషన్లో రాబోతున్న మూడో చిత్రం పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై చినబాబు నిర్మిస్తున్న

ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతం అందించనున్నాడు. ‘భీమ్లా నాయక్’ బ్యూటీ సంయుక్త మీనన్ కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఇన్సైడ్ టాక్. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది. అదేంటి అంటే.. ఈ చిత్రంలో ఒకప్పటి టాలీవుడ్ హీరో తరుణ్ కూడా నటించబోతున్నాడట. తరుణ్ నటించిన ‘నువ్వే కావాలి’, ‘నువ్వే నువ్వే’ వంటి చిత్రాలకు త్రివిక్రమ్ పనిచేశాడు.

అప్పటి నుండి త్రివిక్రమ్ కు తరుణ్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే ఈ ప్రచారం మొదలైంది. ఇదే విషయం పై చిత్ర బృందాన్ని ప్రశ్నించగా… మహేష్- త్రివిక్రమ్ మూవీలో మరో హీరోకి సరిపడా రోల్ ఉంది కానీ.. దానికి ఇంకా ఎవ్వరూ ఫిక్స్ అవ్వలేదు అని చెప్పుకొచ్చింది.

మరోపక్క తరుణ్ సన్నిహిత వర్గాన్ని ఈ విషయం పై ప్రశ్నించగా.. తరుణ్ కు ఇప్పట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా లేదా సహాయ నటుడిగా చేయడం ఇష్టం లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఈ విషయం పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus