దీపావళి సందర్భంగా టాక్సీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

  • November 5, 2021 / 01:55 PM IST

వసంత్ సమీర్ పిన్నమ రాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్ , సౌమ్య మీనన్ , ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్, నవీన్ పండిత… మొదలగు వారు ప్రధాన పాత్రల్లో ‘ హెచ్ అండ్ హెచ్ ఎంటర్టెన్మెంట్స్ ‘ బ్యానర్ పై హరిత సజ్జ ( ఎం.డి) నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ట్యాక్సీ’.స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన హరీష్ సజ్జా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బిక్కి విజయ్ కుమార్(M.Tech) సహ నిర్మాతగా వ్యవరిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ నీ దీపావళి సందర్భంగా విడుదల చేశారు.

వైవిధ్యమైన కథాంశంతో సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులోని హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు మరియు థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఎన్నో ఉంటాయని తెలిపారు.. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టైటిల్ పోస్టర్ విడుదల చేయగా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ‘ లవ్ స్టొరీ ‘ చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేసిన బి జె శ్రీధర్ ఈ చిత్రానికి కూడా ఫైట్స్ కంపోజ్ చేస్తుండడం మరో విశేషం. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావొచ్చాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus