దెయ్యం కారులో విజయ్ దేవరకొండ ప్రయాణం ఇంట్రెస్టింగ్ గా ఉంది

“నోటా” ఫ్లాప్ అనంతరం విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించగా విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం “టాక్సీవాలా”. విడుదలకు ముందే సినిమా లీక్ అవ్వడం మొదలుకొని.. అసలు రిలీజ్ అవుతుందో లేదో అని టీం కూడా భయపడిన పొజిషన్ నుండి ఈవారం విడుదలల్లో మోస్ట్ క్రేజీయస్ట్ ఫిలిమ్ గా నిలిచే స్థాయికి చేరుకొన్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిన్న ఘనంగా నిర్వహించి.. అల్లు అర్జున్ చేతుల మీదుగా ట్రైలర్ ను విడుదల చేశారు.

డిగ్రీ అయిదేళ్లపాటు చదివి ఏ ఉద్యోగం రాక, వచ్చిన ఉద్యోగం చేయలేక, సెకండ్ హ్యాండ్ లో ఒక కారు కొనుక్కొని.. ఆ ట్యాక్సీని తన జీవనాధారంగా మార్చుకొని స్నేహితులతో సరదాగా గడిపేసే కుర్రాడిగా విజయ్ కనిపించాడు. అయితే.. విజయ్ కొన్న కారులో ఏదో దెయ్యం ఉండడంతో.. ఆ కారు ఒక్కోసారి విజయ్ మాట వినకుండా ఇష్టమొచ్చినట్లు వెళుతుంటుంది.

అలా ఆ దెయ్యం కారుతో విజయ్ బాబు పడిన పాట్లే సినిమా కథాంశం. అయితే.. ఆ కారులోకి దెయ్యం ఎలా వచ్చింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం అనుకోండి. ఈ ట్రైలర్ ఇటీవల వచ్చిన నయనతార “డోర” అనే సినిమాను గుర్తుకు తెచ్చినప్పటికీ.. కామెడీ ప్రధానంగా సాగే ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకొనే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రంలో అనంతపూర్ అమ్మాయి ప్రియాంక జవాల్కర్ కథానాయికగా పరిచయమవుతుండగా.. “ది ఎండ్” ఫేమ్ రాహుల్ దర్శకుడిగా ఫీచర్ ఫిలిమ్ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. మరి ఈ సినిమా రిజల్ట్ ఏమిటనేది తెలియాలంటే శనివారం వరకు వెయిట్ చేయాల్సిందే

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus