Donga Naa Koduku: DNK కాకపోతే NKD… ఈ సినిమా టీమ్ ప్లానింగ్ భలే ఉందిగా!
- October 22, 2026 / 03:37 PM ISTByFilmy Focus Desk
సినిమాకు పేరు పెట్టడం ఒకప్పుడు పెద్ద సవాలు. ఆ పేరు సినిమా టీమ్‌కి నచ్చాలి, అభిమానులకు నచ్చాలి, ప్రేక్షకులకూ నచ్చాలి. దీంతో చాలా ఆలోచించి మరీ పెట్టేవారు. అయితే ఇప్పుడు పైన చెప్పిన అందరితోపాటు సెన్సార్ బోర్డు వాళ్లు కూడా వచ్చి చేరారు. కావాలంటే మీరే చూడండి ఇటీవల కాలంలో ఎన్ని సినిమాల టైటిల్స్ చెప్పా చేయకుండా మర్చేస్తున్నారో. చిన్న మార్పు చేసి పాత టైటిల్ దగ్గరకు తీసుకొస్తున్నారు. దానికి కారణం ఆ టైటిల్‌తో ఏదో ఇబ్బంది అంటూ సెన్సార్ టీమ్ చెప్పడమే.
Donga Naa Koduku
ఇప్పుడు ఇలాంటి పరిస్థితే వస్తుంది అనుకుని మైత్రీ మూవీ మేకర్స్ ఓ పని చేసింది అంటున్నారు. ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో హీరో అయిన మౌళి.. ‘దొంగనా కొడుకు’ అనే సినిమా చేశాడు. అయితే ఈ టైటిల్ విషయంలో సెన్సార్ అభ్యంతరం రావొచ్చని టీమ్ ముందుగానే పేరును DNKగా మార్చింది. అంటే షార్ట్ ఫామ్‌లోకి వచ్చింది. అంతేకాదు మరో రెండు మూడు టైటిళ్లని ఆప్షన్‌గా పెట్టుకుందట. అదే ‘నా కొడుకు దొంగ’. టైటిల్‌లో లోగో అలానే ఉండి.. పదాల ఆర్డర్ మారుతుంది అంతే.
నిజానికి, ‘దొంగ నా కొడుకు’ అనేది తప్పేం కాదు. కానీ వాడుకలో అది ఓ తిట్టుగా, అభ్యంతరకర పదాలుగా మారిపోయాయి. కోపంలో ఇలా అనేస్తున్నారు. కొంతమంది మరీ ప్రేమ ఎక్కువై కూడా ఇలా అంటున్నారు. మీరు కూడా వినే ఉంటారు. అయితే ఇప్పుడు సెన్సార్ టీమ్ చాలా సెన్సిటివ్‌గా ఉంది. తర్వాత ట్రోలింగ్ వస్తుందనో, కేసులు పడతాయనో టైటిల్స్ మీద చాలా దృష్టి పెడుతోంది. ‘కపుల్ ఫ్రెండ్లీ’ అనే తప్పు అన్నారు. అందుకే ‘దొంగ నా కొడుకు’ టీమ్ ముందస్తు ఆలోచన చేసింది.
సినిమా టీజర్‌ను అయితే ఆ టైటిల్‌తోనే అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడెవరైనా ఇబ్బంది పడి, అడిగితే టైటిల్ మారుస్తారా? లేక సెన్సార్ ఏమీ అనలేదు కాబట్టి వదిలేస్తారా అనేది చూడాలి.















