సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘సాక్షి’ టీజర్ రిలీజ్

సూపర్‌స్టార్ కృష్ణ‌ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన హీరో శ‌రణ్ కుమార్ నటిస్తున్న సినిమా సాక్షి . శివ కేశ‌న కుర్తి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమాను ఆర్. యూ రెడ్డి అండ్ బేబీ లాలిత్య సమర్పణలో రూపొందిస్తున్నారు. శ్రీ వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.3గా మునగాల సుధాక‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ చేపడుతున్న మేకర్స్.. సరికొత్తగా అప్ డేట్స్ వదులుతూ సినిమాపై హైప్ తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ప్రముఖ ఇన్ఫ్లూఎన్సర్స్ చేతుల మీదగా ఈ చిత్ర టీజర్ లాంచ్ చేశారు.

ఒక నిమిషం 9 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ లో ఆసక్తికర సన్నివేశాలతో పాటు యాక్షన్ పార్ట్ చూపించారు. గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కొత్త హీరో శ‌రణ్ కుమార్ ఫైట్ సీన్స్ ఇరగ దీశారని ఈ టీజర్ స్పష్టం చేస్తోంది. చిత్రంలో ఏదో కొత్త పాయింట్ టచ్ చేస్తూ సస్పెన్స్ క్రియేట్ చేశారు మేకర్స్. ప్రేక్షకుల్లో సాక్షి సినిమాపై హోప్స్ పెంచేసింది ఈ టీజర్.

ఈ సినిమా నుంచి హీరో శ‌రణ్ కుమార్ లుక్ ఇది వరకే రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది. అదేవిధంగా సూప‌ర్‌స్టార్ కృష్ణ విడుద‌ల చేసిన ఫస్ట్ లుక్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆ తర్వాత నాగబాబు పాత్రకు సంబంధించిన లుక్ క్యూరియాసిటీ పెంచింది. ఇప్పుడు టీజర్ వదిలి ప్రేక్షకుల దృష్టిని సాక్షి సినిమా వైపు తిప్పుకున్నారు దర్శక నిర్మాతలు.

ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీర్ కౌర్ నటిస్తుండగా.. నాగబాబు మెయిన్ విలన్‌గా ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. అజయ్, ఇంద్రజ, ఆమని ఇలా భారీ క్యాస్టింగ్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భీమ్స్ సిసిరీలియో సంగీతం అందించిన ఈ సాక్షి సినిమా రిలీజ్ డేట్ అతిత్వరలో అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus