పెంపుడు కుక్కకి తులాభారం.. హీరోయిన్ పై ట్రోలింగ్

మహేష్ బాబు ‘ఖలేజా’ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ‘అమ్మా నాన్నల కంటే నీకు మొక్కలే ఎక్కువైపోయాయా’ అంటూ అర్ధం వచ్చే డైలాగ్ అది. దర్శకుడు త్రివిక్రమ్.. ఆ సినిమాలో హీరోయిన్ అనుష్క పాత్రలోని అమాయకత్వాన్ని.. ప్రెజెంట్ జెనరేషన్లో ఉండే అమ్మాయిల మనస్తత్వాన్ని వర్ణిస్తూ ఆ డైలాగ్ పెట్టినట్టు ఉన్నారు. ఆ సినిమా టైంలో ఏమో కానీ… ఇప్పుడు అంటే ఈ 2026 టైంకి లేదా ప్రెజెంట్ జెనరేషన్ అమ్మాయిలకు ఆ డైలాగ్ కరెక్ట్ గా యాప్ట్ అవుతుందనే చెప్పాలి.

Teena Sravya

ఈరోజుల్లో అమ్మాయిలందరికీ అటెన్షన్ పిచ్చి ఏర్పడింది. మనుషులకంటే కుక్కలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. రీసెంట్ గా నవీన్ పోలిశెట్టి నుండి వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో హీరోయిన్ మీనాక్షి చౌదరి పాత్ర కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. రెండు రోజుల క్రితం కుక్కల విషయంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్, యాంకర్ రష్మీ చేసిన హడావిడి అందరికీ తెలిసిందే. వాటి సంరక్షణలో భాగంలో వీళ్ళు చేసిన కామెంట్లపై విమర్శలు కురిశాయి.

వీధి కుక్కల కారణంగా యాక్సిడెంట్ల పర్సెంటేజీ పెరిగి జనాలకు ఇబ్బంది ఎదురవుతుందని, కాబట్టి వీధి కుక్కలను హతమార్చాలంటూ తీసుకొచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో భాగంగా రేణు దేశాయ్, రష్మీ రెచ్చిపోయారు. అందుకే వాళ్ళపై ఓ రేంజ్లో ట్రోలింగ్ జరిగింది.ఇలాంటి నేపథ్యంలో హీరోయిన్ టీనా శ్రావ్య(Teena Sravya) మేడారం జాతరలో తన పెంపుడు కుక్కను త్రాసులో కూర్చోబెట్టి బెల్లం మొక్కు చెల్లించింది.

దీంతో ఆమెపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు కురుస్తున్నాయి. ఇది ఆదివాసీ దేవతలను అవమానించడమేనని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే టీనా తల్లి మాత్రం ఇది మొక్కులో భాగంగానే చేసినట్టు సమర్ధించుకుంది. కమిటీ కుర్రోళ్ళు’ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ వంటి సినిమాలతో టీనా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

2వ సారి తల్లి కాబోతున్న పూర్ణ.. బేబీ బంప్‌ ఫోటోలతో క్లారిటీ

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus