ఎలిమినేట్ పై తేజస్వి సంచలన ఆరోపణలు!

స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 2 బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో ఒక్కోవారం ఒక్కో పార్టిసిపెంట్ బయటికి వస్తున్నారు. ఈ వారం నటి తేజస్వి ఎలిమినేట్ అయింది. ఈమె ప్రవర్తన బాగాలేదని, వేసుకునే దుస్తులు సైతం చూసేందుకు ఎబ్బెట్టుగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తడంతో.. ఆమెను షో నిర్వాహకులు హౌస్ నుంచి బయటికి పంపించారు. అయితే తేజస్వి బయటికి వచ్చిన తర్వాత అసలు విషయం తెలుసుకుని బాధపడింది. తనని కావాలని కొంతమంది బ్యాడ్ గా చేశారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో తేజస్వి తన ఫేస్ బుక్ అకౌంట్ లో లైవ్ కి వచ్చి మాట్లాడింది.

“బిగ్ బాస్ లో ఒక రోజులో జరిగిన అన్ని సంఘటనలు కలిపి గంట సేపు చూపించారు, ఆ గంట వీడియో చూసి ఆడియన్స్ తనను నెగెటివ్ గా జడ్జ్ చేసి ఎలిమినేట్ చేశారు” అని ఆవేదన వ్యక్తం చేసింది. చూపించినవన్నీ నిజాలు కావని, తాను అరిచిన విషయాలే బిగ్ బాస్ లో చూపించారని ఆరోపించింది. చాలాసార్లు కౌశల్ కు సారీ చెప్పిన వీడియో ఎందుకు చూపించలేదని ప్రశ్నించింది. కౌశల్ తో తాను గొడవ పడలేదని, వేరే అమ్మాయిపై అతడు చెయ్యి వేస్తే ప్రశ్నించినందుకు కౌశల్ ఆర్మీ తనను టార్గెట్ చేసిందని  కామెంట్స్ చేసింది. 24 గంటలపాటు కౌశల్ ఆర్మీ హౌస్ లోపల ఉంటే వారే అతడిని చంపి బటయకు తీసుకొస్తారని సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను ఒక్క బూతు మాట్లాడినందుకే వందల బూతులు తిడుతూ ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

తనకు మరో చాన్స్ ఇవ్వాలని, తనను మళ్లీ షోలో చూడాలనుకుంటే ఓటింగ్ లో గెలిపించాలని రిక్వెస్ట్ చేసింది. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన ఆరుగరు హౌస్ మేట్స్ లో ఒకరికి రీఎంట్రీ చాన్స్ ఉంటుందని బిగ్ బాస్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ ఓటింగ్ ద్వారా ఒకరికి రీఎంట్రీ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తాయో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus