వివేక్ టు సిరివెన్నెల… ఈ ఏడాది మరణించిన సినీ తారల లిస్ట్..!

2020వ సంవత్సరంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్,ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం వంటి స్టార్లు మరణించడంతో 2021 అలా ఉండకూడదు అని అంతా కోరుకున్నారు. కానీ 2021 కూడా 2020 కి ఏమాత్రం తీసిపోలేదు. 2021 సంవత్సరం కూడా చిత్ర పరిశ్రమకు విషాదాన్నే మిగిల్చిందని చెప్పాలి.ఈ ఏడాది పునీత్ రాజ్ కుమార్ వంటి స్టార్ హీరో అలాగే సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి స్టార్ లిరిసిస్ట్ లు మరణించారు. వీరితో పాటు చాలా మంది ప్రముఖ నటులు, నిర్మాతలు కూడా మృతి చెందారు. ఆ లిస్ట్ ను ఒకసారి గమనిస్తే :

1) వివేక్ :

తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా తన కామెడీతో పాపులర్ అయిన కమెడియన్ వివేక్ 2021 ఏప్రిల్ 17వ తేదీన గుండెపోటుతో చెన్నైలోని ఓ హాస్పిటల్ లో మరణించాడు. 300కు పైగా సినిమాల్లో నటించిన వివేక్ పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.ఈయన వయసు 59 సంవత్సరాలు.

2) కె.వి.ఆనంద్ :

‘వీడొక్కడే’ ‘రంగం’ ‘బ్రదర్స్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరించిన దర్శకుడు కె.వి.ఆనంద్ కూడా ఈ ఏడాది ఏప్రిల్ లో గుండెపోటుతో మరణించాడు.

3) టి.ఎన్.ఆర్ :

ప్రముఖ జర్నలిస్ట్, యాంకర్, నటుడు అయిన టి.ఎన్.ఆర్ ఈ ఏడాది మేలో కరోనాతో మరణించారు.

4) బి.ఎ.రాజు :

ప్రముఖ జర్నలిస్ట్,నిర్మాత, మహేష్ బాబు పి.ఆర్.ఓ అయిన బి.ఏ.రాజు కూడా ఈ ఏడాది గుండెపోటుతో మరణించారు.

5) జయంతి :

తెలుగుతో పాటు కన్నడలో కూడా స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న నటి జయంతి కూడా ఈ ఏడాది జూలైలో మరణించారు.

6) ‘వేదం’ నాగయ్య :

‘వేదం’ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమైన నాగయ్య.. అటు తర్వాత ‘రామయ్యా వస్తావయ్యా’ ‘స్పైడర్’ ‘బలుపు’ వంటి చిత్రాల్లో నటించారు. ఈ ఏడాది మార్చిలో ఈయన మరణించడం జరిగింది.

7) పునీత్ రాజ్ కుమార్ :

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ ఈ ఏడాది ‘యువరత్న’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యారు. ఇతను కూడా అక్టోబర్లో గుండెపోటుతో మరణించాడు. ఇతని వయసు కేవలం 46 ఏళ్ళు మాత్రమే.

8) మహేష్ కోనేరు :

ప్రముఖ జర్నలిస్ట్, నిర్మాత, ఎన్టీఆర్ పి.ఆర్వో అయిన మహేష్ కోనేరు కూడా ఈ ఏడాది అక్టోబర్లో గుండెపోటుతో మరణించారు.

9) మహేష్ కత్తి :

ప్రముఖ జర్నలిస్ట్, బిగ్ బాస్ కంటెస్టెంట్, నటుడు అయిన మహేష్ కత్తి ఈ ఏడాది జూలైలో మరణించాడు.

10) పొట్టి వీరయ్య :

దాదాపు 400 సినిమాల్లో కమెడియన్ గా నటించిన పొట్టి వీరయ్య ఈ ఏడాది ఏప్రిల్ లో మరణించాడు.

11) శివ శంకర్ మాస్టర్ :

ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత అయిన శివ శంకర్ మాస్టర్ ఈ ఏడాది నవంబర్ లో కరోనాతో మరణించారు.

12) సిరివెన్నెల సీతారామశాస్త్రి :

టాలీవుడ్ స్టార్ లిరిసిస్ట్ అయిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి కూడా ఈ ఏడాది నవంబర్ లో మరణించిన సంగతి తెలిసిందే.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus