VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

తెలుగు సినిమా ఫ్యాన్స్‌ మీ సినిమా చూడాలి. టాలీవుడ్ వసూళ్లు భారీగా రావాలి.. కానీ మీ సినిమాకు మాత్రం తెలుగు టైటిల్‌ పెట్టరు. తెలుగు వాళ్లు అంటే మీకు అంత లోకువ అయిపోయారా? ఈ మాటలు గత కొన్ని ఏళ్లుగా వింటూనే ఉన్నారు. తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినిమాలు అదే భాషకు చెందిన పేరుతో రిలీజ్‌ అయినప్పుడల్లా సినిమా జనాలు ఇదే మాట అనుకుంటూ ఉన్నారు. ఈ ఎఫెక్ట్‌ ఇతర భాషల సినిమాల టీమ్‌లకు బాగా తెలుసుకూడా. విపరీతమైన ట్రోలింగ్‌ జరిగింది కూడా.

VeeraBhadrudu

ఈ ట్రోలింగ్‌ హీట్‌ ఎదుర్కొన్న తమిళ హీరోల్లో సూర్య కూడా ఉన్నాడు. ఆయన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్‌ అవ్వడం పెద్ద విషయం కాదు. ఆయన స్టార్‌ హీరో అవ్వకముందు నుండి డబ్బింగ్‌ రిలీజ్‌లు జరుగుతున్నాయి. చాలా వరకు మంచి విజయం కూడా అందుకున్నాయి. అందులో తెలుగు టైటిల్‌ ఉన్న సినిమాలు చాలా తక్కువ. తొలి రోజుల్లో పెద్దగా ఈ విషయం ఎవరూ పట్టించుకోలేదు కానీ.. ఇప్పుడు పూర్తిగా అర్థం కాని తమిళ పేర్లను ఉంచేస్తున్నారు అనే చర్చ మొదలైంది. దానికి రీసెంట్‌ ఉదాహరణ ‘కంగువ’.

ఆ సినిమా ఫలితం ఎంత తేడాగా వచ్చిందో.. తెలుగు పేరు విషయంలోనూ అంతే రచ్చ జరిగింది. ఇదంతా జరిగిందనో, అప్పుడు ట్రోలింగ్‌ వచ్చిందనో ఇప్పుడు కొత్త సినిమా పేరు మార్చేశారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కరుప్పు’ సినమాకు తెలుగు పేరు పెట్టారు. అదే ‘వీరభద్రుడు’. దీంతో ఈ సారి సూర్యకి ట్రోలింగ్‌ సమస్య ఉండదు. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా మే 14న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. సూర్య, త్రిష కాంబో మీద ఎంత అంచనాలు ఉన్నాయో.. సాయి అభ్యంకర్‌ సంగీతం మీద కూడా అంతే అంచనాలు ఉన్నాయి. మరి ఎలా అంచనాలు అందుకుంటారో చూడాలి.

టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags