ప్రాంతీయ అభిమానం, భాషా అభిమానం అన్ని రంగాల్లో ఉంటుంది. అయితే సినిమా రంగంలో ఈ హద్దులను కొంతమంది స్టార్స్ చెరిపివేసారు. తమిళనాడుకు చెందిన కమలహాసన్ విశ్వనటుడిగా పేరుతెచ్చుకున్నారు. తెలుగు వారు కూడా ఇతర భాషల్లో పాపులర్ అయ్యారు. అటువంటి స్టార్స్ పై ఫోకస్..
విశాల్తెలుగు చిత్రాల నిర్మాత జీకే రెడ్డి తనయుడు విశాల్ సెల్యూట్ తో తెలుగులో పరిచయం అయ్యారు. ఆ చిత్రం కంటే ముందే తమిళంలో విశాల్ స్టార్ హీరోగా పాపులర్ అయ్యారు.
సాయి కుమార్తెలుగు వారికీ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తెలిసిన సాయి కుమార్ కన్నడ చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోల్లో ఒకరు.
అతను కన్నడలో నటించిన “పోలీస్ స్టోరీ” తెలుగులో రిలీజ్ అయి ఇక్కడ కూడా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.
సమీరా రెడ్డిఅందాల తార సమీరా రెడ్డి రాజమహేంద్రవరం (రాజముండ్రి)లో పుట్టింది. అయినా బాలీవుడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అక్కడ సినిమాల్లో నటిగా నిరూపించుకున్న తర్వాత తెలుగులో నరసింహుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది.
శ్రీదేవిఅతిలోకసుందరి శ్రీదేవి తల్లి సొంతూరు తిరుపతి. తమిళనాడులో పెరిగిన ఈ బ్యూటీ తమిళం, తెలుగులో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయింది. బాలీవుడ్ లోను సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. దక్షిణాది కంటే ఉత్తరాదిలోనే ఎక్కువమంది అభిమానులను సంపాదించుకుంది.
రేఖస్టార్ హీరోయిన్ రేఖ అమ్మ పేరు పుష్పవల్లి. ఆమె తెలుగు నటి. అయినా రేఖ మాత్రం బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేసి హిందీ నటిగా పేరు తెచ్చుకుంది.
శ్రీకాంత్శ్రీకాంత్ (శ్రీరామ్) “ఒకరికి ఒకరు” సినిమాతో తెలుగులో అడుగుపెట్టారు. అయితే ఈ నటుడు తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసి పాపులర్ అయ్యారు.
జీవాతెలుగు నిర్మాత ఆర్ బీ చౌదరి కొడుకు జీవా. రంగం సినిమాతో తెలుగు వారికి దగ్గరైన జీవా తమిళంలో స్టార్ హీరోల్లో ఒకరిగా ఎదిగారు.
ఆది పినిశెట్టితెలుగు వాడైనా ఆది పినిశెట్టి తెలుగులోనే మొదట సినిమా చేశారు. తేజ దర్శకత్వంలో ఆది చేసిన ఒక `V` చిత్రం హిట్ కాలేదు. దీంతో తమిళంలో అడుగుపెట్టి వరుసగా విజయాలు అందుకున్నారు. తమిళవారి అభిమాన హీరో అయ్యారు.