Vijay, Karthi: ‘సర్ధార్’ లుక్ లో కార్తీ.. గుర్తుపట్టలేకపోయిన స్టార్ హీరో!

Advertisement

తమిళ స్టార్ హీరో విజయ్ ఇటీవల తన కారు పన్ను ఎగ్గొట్టిన సంఘటనలతో వార్తల్లో నిలిచారు. 2012లో ఎనిమిది కోట్ల విలువైన రోల్స్‌ రాయిస్‌ గోస్ట్‌ అనే కారుని ఇంగ్లాండ్ నుండి దిగుమతి చేసుకున్న విజయ్.. దీనికి కట్టాల్సిన కోటిన్నర పన్నుని ఎగ్గొట్టారు. పన్ను మినహాయింపు ఇవ్వాలని కోర్టుని ఆశ్రయించిన విజయ్ కి చుక్కెదురైంది. పన్ను మొత్తం కట్టడంతో పాటు ఫైన్ కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం విజయ్ ‘బీస్ట్’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

నెల్సన్ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ చెన్నై నగర్ శివార్లలో ఉన్న శ్రీ గోకులం స్టూడియోస్ లో జరుగుతోంది. అదే ప్రాంతంలో కార్తీ ‘సర్ధార్’ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. దీంతో కార్తీ.. విజయ్ ని కలుద్దామని ‘బీస్ట్’ సెట్స్ దగ్గరకు వెళ్లాడు. ‘సర్ధార్’ గెటప్ లోనే కార్తీ.. విజయ్ దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ విజయ్ చూసీచూడనట్లుగా ప్రవర్తించాడట. దీంతో కార్తీ.. విజయ్ కు మరింత దగ్గరగా వెళ్లి తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడట.

దీంతో షాకైన విజయ్ వెంటనే కార్తీని హగ్ చేసుకున్నాడట. ‘సర్ధార్’ గెటప్ లో ఉన్న కార్తీని చూసి విజయ్ గుర్తుపట్టలేకపోయారు. కార్తీ మాట్లాడడం మొదలుపెట్టాక అసలు విషయం గ్రహించాడు. కాసేపు హీరోలు ఇద్దరూ సెట్స్ పైనే సరదాగా కబుర్లు చెప్పుకున్నట్లు తెలుస్తోంది. కార్తీ నటిస్తోన్న ‘సర్ధార్’ సినిమాని పిఎస్ మిత్రన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో సిమ్రాన్, రాశిఖన్నా, మురళీ శర్మ, చుంకీ పాండే లాంటి తారలు ముఖ్య పత్రాలు పోషిస్తున్నారు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus